
ట్యాగ్ · 558 కథనాలు · పేజీ 27


నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి

"అఖండ" మేకింగ్ వీడియో రిలీజ్

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్

ఫైనల్లీ 'గుడ్ లక్ సఖి' వచ్చేస్తుంది..!

సుదర్శన్ థియేటర్ లో "అఖండ" 50 రోజుల వేడుకలు

'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్

పవర్ ఆఫ్ గని - వరుణ్ తేజ్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం

'RC 15' లో నా పాత్ర చూసి షాకవుతారు..!
ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ కథా చిత్రాలతో అలరించిన స్టార్ హీరోలు ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో, విలన్ పాత్రల్లో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో ఫస్ట్ ప్లేస్ లో జగపతి బాబు ఉండగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు.. ఎన్నో పాత్రలు పోషించాడు. ఇక ఇప్పుడు హీరోగా చేస్తూనే మరోపక్క పలు కీలక పాత్రలు చేస్తున్నాడు. రీసెంట్ గా అఖండలో విలన్ పాత్రలో చేసి మరోసారి ప్రశంసలు అందుకున్నాడు.

నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.

"అఖండ" మేకింగ్ వీడియో రిలీజ్
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్
మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తరువాత పలు లేడీ ఓయెంటెడ్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో గుడ్ లక్ సఖి సినిమా కూడా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఈసినిమా కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

'అల వైకుంఠపురములో'.. హిందీ డబ్బింగ్ రిలీజ్ లో ట్విస్ట్
సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందే తెలిసిందే కదా. మొదటిసారి పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. మన తెలుగు ప్రేక్షకులకు బన్నీ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇక పుష్పతో నార్త్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈనేపథ్యంలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈసినిమా రీమేక్ కూడా వస్తుంది బాలీవుడ్ లో. కానీ ముందే డబ్బింగ్ చేసి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక అందులో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ది డిఫరెంట్ స్టైల్. అందమైన ప్రేమకథలను తెరపై అంతే అందంగా చూపించడంతో ఇంద్రగంటిది డిఫరెంట్ స్టైల్. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి ఎన్నో ప్రేమకథలను చూపించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నాగశౌర్య ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తిచేసే పనిలో పడ్డాడు. నాగ శౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. అనీష్ కృష్ణ ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

ఫైనల్లీ 'గుడ్ లక్ సఖి' వచ్చేస్తుంది..!
మొత్తానికి ఇన్ని రోజులకు కీర్తిసురేష్ గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కు విముక్తి కలిగింది. కరోనా వల్ల ఈ సినిమా ఇప్పటి వరకూ ఎన్నో సార్లు రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ చేస్తారని కూడా అన్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. ఇక గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ కూడా రావడంతో మళ్లీ చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కు సిద్దమైంది గుడ్ లక్ సఖి. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈనెల 28వ తేదీన…

ఓటీటీలోకి సుమంత్ 'మళ్ళీ మొదలైంది'
మళ్లీ ఓటీటీల రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితులు అసలు బాలేకపోవడంతో, థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా చిన్న సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఒక రకంగా ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ పెరిగింది కూడా గత రెండేళ్ల నుండే అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వేవ్ తరువాత కాస్త పరిస్థితులు అనుకూలించడంతో అప్పటివరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలను.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఆపిన సినిమాలను వరుసగా రిలీజ్ చేసేశారు. ఇక ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. మళ్లీ కొన్ని చోట్ల కర్ఫ్యూలు, థియేటర్లు మూసివేయడంతో.. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోతున్నాయి. మీడియం…

సుదర్శన్ థియేటర్ లో "అఖండ" 50 రోజుల వేడుకలు
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “అఖండ “మూవీ భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను…

'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్
తమిళ హీరోల సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి కూడా విదితమే. ఇక రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. పదవి, అధికారం కోసం సామాన్యులను అంతం చేయడానికి చూస్తున్న రాజకీయ నాయకులను ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంపై ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు శరవణన్.

పవర్ ఆఫ్ గని - వరుణ్ తేజ్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం అందించారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన "గని" మూవీ మార్చి 18 హోలీ రోజున రిలీజ్ కానుంది.

రామ్ 'ది వారియర్' ఫస్ట్ లుక్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకొని మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటివరకూ 'RAPO19' అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 'ది వారియర్' అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. రామ్ పోతినేని పోలీస్ పాత్రలో ఉన్న లుక్ రివీల్ చేశారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో…

"బుట్టబొమ్మ " సాంగ్ గురించి పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

"గని " మూవీ లో తమన్నా స్పెషల్ సాంగ్
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ మార్చి 18 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేశారు.

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో
ఈమధ్య హీరోలు కూడా తమ పంథాను మార్చేశారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాదు విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి నెగెటివ్ షేడ్ లో కూడా కనిపించడానికి అస్సలు వెనుకాడట్లేదు. అంతేకాదు పాత్ర నచ్చితే వేరే సినిమాల్లో కూడా చేసేస్తున్నారు. అలా చేసే వారిలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ కు సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే చాలా కాలం సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆమధ్య వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత అల వైకుంఠపురములో…

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్
నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. బంగార్రాజు పాత్రలో తన చలాకీ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నాడు నాగార్జున. అందుకే ఈ పాత్ర పేరుతోనే ఇప్పుడు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. అయితే ఈసినిమాలో నాగార్జునతో పాటు తనయుడు నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ. తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం
యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , "బ్లాక్" మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “తీస్ మార్ ఖాన్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'స్కైలాబ్'
సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కైలాబ్. 1979 లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. డిసెంబర్ 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక సత్యదేవ్-నిత్యామీనన్ కాబట్టి.. తమ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఈసినిమాలో కూడా తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఈసినిమాతో నిర్మాతగా మారింది నిత్యామీనన్. ఇక మొదటి సినిమాతోనే మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఈసినిమా కూడా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా…

'రౌడీ బాయ్స్' ఫంక్షన్ కు రావడం ఫేవర్ కాదు నా బాధ్యత
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా దిల్ రాజు భారీగానే చేస్తున్నాడు. పోస్టర్లు, పాటల రిలీజ్ లకు కూడా స్పెషల్ గా ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు ప్రమోషన్స్ లో పెద్ద పెద్ద హీరోలను సైతం వాడేస్తున్నాడు.