టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా దిల్ రాజు భారీగానే చేస్తున్నాడు. పోస్టర్లు, పాటల రిలీజ్ లకు కూడా స్పెషల్ గా ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు ప్రమోషన్స్ లో పెద్ద పెద్ద హీరోలను సైతం వాడేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి డేట్ నైట్ అనే పాటను రిలీజ్ చేశారు. ఇక ఈపాట రిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఈ ఫంక్షన్ నాకెంతో స్వీట్. నా జీవితంలో ఆర్య సినిమా ఎంతో ముఖ్యమైంది. సుకుమార్‌గారు లేకపోతే ఆర్య సినిమా ఎలా లేదో.. దిల్ రాజుగారు కూడా లేకపోతే ఆర్య సినిమా లేదు. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు.. ఆశిష్, అన్షు, హర్షిత్ అందరూ చిన్న పిల్లలు. షూటింగ్ సమయంలో పక్కన కూర్చునేవాళ్లు. నేను అప్పుడు వాళ్లు ఇంత సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అవుతారని అనుకోలేదు. ఇప్పుడు చూసి అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫంక్షన్‌కి రావడం నేను చేస్తున్న ఫేవర్ కాదు. నా బాధ్యత. డేట్ సాంగ్ చాలా బావుంది. చూస్తుంటే ఫిబ్రవరి 14న రావాల్సిన సినిమాను జనవరి 14నే రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. రౌడీ బాయ్స్ ఎంటైర్ టీమ్‌కి అభినందనలు. ఆశిష్ చాలా బాగా స్టెప్పులేశాడు అంటూ ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
ఇక ఇదే సందర్భంలో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న సినిమాలన్నీ బావున్నాయి. అఖండ, మా పుష్ప సినిమాలు వచ్చాయి. అలాగే నానిగారి శ్యామ్ సింగరాయ్ కూడా పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ టీమ్‌కు కంగ్రాట్యులేట్ చేయడం నాకు కుదరలేదు. ఈ వేదికగా చెబుతున్నాను. నానిగారితో సహా టీమ్ అందరూ అద్భుతంగా చేశారు. డైరెక్టర్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు బావుంది. శ్యామ్ సింగరాయ్ చాలా బావుంది. సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయం. అన్నీ సినిమాలు సక్సెస్ కావాలి’’ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: