అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ మార్చి 18 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గని ” మూవీ లో స్పెషల్ సాంగ్ లో మెరిసే స్టార్ హీరోయిన్ ఎవరు అని టాక్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ బ్యూటీ ఎవరో చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ తమన్నా పెర్ఫార్మ్ చేశారు. ఆ స్పెషల్ సాంగ్ జనవరి 15 ఉదయం 11 గంటల 8 నిమిషాల కు రిలీజ్ కానుంది. అనేక స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన తమన్నా “గని ” మూవీ స్పెషల్ సాంగ్ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: