సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కైలాబ్. 1979 లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. డిసెంబర్ 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక సత్యదేవ్-నిత్యామీనన్ కాబట్టి.. తమ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఈసినిమాలో కూడా తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఈసినిమాతో నిర్మాతగా మారింది నిత్యామీనన్. ఇక మొదటి సినిమాతోనే మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఈసినిమా కూడా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా జనవరి 14 వ తేదీ నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A delightful period musical comedy of the coming-of-age journeys of the three principal characters with poignant moments that linger. #SkyLab streaming on SonyLIV from 14 Jan. #SkyLabOnSonyLIV@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/t2w7SjTpdS
— SonyLIV (@SonyLIV) January 11, 2022
కాగా విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో రాహుల్ రామకృష్ణ మరో కీలక పాత్రలో నటించగా.. తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష తదితరులు నటించారు. బైట్ ఫీచర్స్, నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై పృథ్వీ పిన్నమరాజు, నిత్య మీనన్ కలిసి నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం.. సినిమాటోగ్రఫి ఆదిత్య జవ్వాది అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: