ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ కథా చిత్రాలతో అలరించిన స్టార్ హీరోలు ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో, విలన్ పాత్రల్లో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో ఫస్ట్ ప్లేస్ లో జగపతి బాబు ఉండగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు.. ఎన్నో పాత్రలు పోషించాడు. ఇక ఇప్పుడు హీరోగా చేస్తూనే మరోపక్క పలు కీలక పాత్రలు చేస్తున్నాడు. రీసెంట్ గా అఖండలో విలన్ పాత్రలో చేసి మరోసారి ప్రశంసలు అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు శ్రీకాంత్ శంకర్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఈసినిమా మరో కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ తన రోల్ గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఈసినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.. నా పాత్రను చూసి ప్రతి ఒక్కరూ షాకవుతారు. అంతేకాదు కొత్త శ్రీకాంత్ ను చూస్తారు.. అసలు ఇతను శ్రీకాంతేనా? అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి శ్రీకాంత్ చెప్పినట్టు తన పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: