మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a wrap for the roller coaster movie of the year ♥️#AnteSundaraniki pic.twitter.com/1Kq27vtPF9
— Nani (@NameisNani) January 23, 2022
తాజాగా “అంటే .. సుందరానికీ !” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం “అంటే .. సుందరానికీ !” షూటింగ్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ, షూటింగ్ చివరి రోజు తీసిన ఒక చిన్న వీడియోను కూడా హీరో నాని షేర్ చేశారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: