ఓటీటీలోకి సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’

Sumanths Malli Modalaindi Movie To Have Direct OTT Release,Sumanth’s Malli Modalaindi Movie Direct To OTT Release On ZEE5,Sumanth's Malli Modalaindi To Have Direct OTT Release,Sumanth's Malli Modalaindi OTT Release Confirmed,Sumanth's Malli Modalaindi Heads For Direct OTT Release,Sumanth's Malli Modalaindi,Malli Modalaindi OTT Release Date,Malli Modalaindi OTT Platform,Sumanth's Malli Modalaindi To Stream On ZEE5,ZEE5 To Release Sumanth's Malli Modalaindi,Sumanth's Film Malli Modalaindi Movie Going For Direct OTT Release,Sumanth's Malli Modalaindi Movie Direct To OTT Release On ZEE5,Malli Modalaindi Movie OTT Release Date,Malli Modalaindi Movie OTT Release,Malli Modalaindi OTT Release,Sumanth's Malli Modalaindi Confirms Its OTT Release,ZEE5 To Release Sumanth's Malli Modalaindi,Malli Modalaindi On OTT Platform ZEE5,Malli Modalaindi On ZEE5,Malli Modalaindi Official Trailer,Sumanth,Naina,Naina Ganguly,Keerthi Kumar,Anup Rubens,Naina Ganguly Movies,Latest 2022 Telugu Movie,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,Sumanth Movies,Sumanth New Movie,Sumanth Upcoming Movie,Sumanth Latest Movie Update,Sumanth Malli Modalaindi,Malli Modalaindi Movie Trailer,Malli Modalaindi,Malli Modalaindi Movie,Malli Modalaindi Telugu Movie,Malli Modalaindi Movie Updates,Malli Modalaindi Movie Latest Updates,Malli Modalaindi Trailer,Malli Modalaindi Movie Songs,#MalliModalaindi,#MalliModalaindiOnZEE5

మళ్లీ ఓటీటీల రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితులు అసలు బాలేకపోవడంతో, థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా చిన్న సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఒక రకంగా ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ పెరిగింది కూడా గత రెండేళ్ల నుండే అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వేవ్ తరువాత కాస్త పరిస్థితులు అనుకూలించడంతో అప్పటివరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలను.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఆపిన సినిమాలను వరుసగా రిలీజ్ చేసేశారు. ఇక ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. మళ్లీ కొన్ని చోట్ల కర్ఫ్యూలు, థియేటర్లు మూసివేయడంతో.. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోతున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాలు మళ్లీ ఓటీటీ బాట పడుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కు సిద్దమైంది. సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా మళ్ళీ మొదలైంది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో ఈసినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసినిమాను థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

కాగా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నఈ సినిమాలో పోసాని, మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here