
ట్యాగ్ · 558 కథనాలు · పేజీ 18


కన్ఫామ్.. మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్..!

చిన్న విలేజ్ లో "సింహాద్రి " మూవీ రికార్డ్

రాశీఖన్నా లేటెస్ట్ లుక్

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ అప్ డేట్..!

గాలి నాగేశ్వర రావు కు జోడీగా పాయల్ రాజ్ పుత్

'ఏజెంట్' లో జాయిన్ అయిన మమ్ముట్టి..!

మారుతి-ప్రభాస్ సినిమా కన్ఫామ్ అయినట్టేనా..!

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ కు ముందే యూఎస్ లో "RRR" హంగామా

మథర్-డాటర్ మూమెంట్..!

ఆది పినిశెట్టి 'క్లాప్' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరోలపై పూజా హెగ్డే కామెంట్స్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజా హెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “రాధేశ్యామ్” మూవీ మార్చి 11 , “ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

దుల్కర్ 'సెల్యూట్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సెల్యూట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈసినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇక ముందు నుండి ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అంతేకాదు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈసినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అప్పుడు కరోనా థర్డ్ వేవ్ వల్ల కుదరలేదు.

'కబ్జ'.. శ్రియ ఫస్ట్ లుక్ రిలీజ్..!
ఒకప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో మెప్పించింది శ్రియ సరన్. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఇక వివాహం అనంతరం కాస్త సినిమాలను తగ్గించినా ఈమధ్య పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అయితే దక్కించుకుంటుంది. త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది శ్రియ. ఇక ఇప్పుడు మరో సినిమాలో మరో అవకాశం దక్కించుకుంది.

కన్ఫామ్.. మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్..!
మంచు విష్ణు గతకొంత కాలంగా సరైన హిట్లు లేక కెరీర్ లో వెనుకపడిన సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లో కాస్త సినిమాలు హిట్ అయినా ఆ తరువాత సరైన హిట్ పడక కొన్నేళ్లు అయిపోతుంది. ఇక ఇటీవలే మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆసినిమా కూడా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. మంచు విష్ణు ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

చిన్న విలేజ్ లో "సింహాద్రి " మూవీ రికార్డ్
విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక , అంకిత కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “సింహాద్రి “మూవీ ని తెరకెక్కించారు. “సింహాద్రి “మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

రాశీఖన్నా లేటెస్ట్ లుక్
సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో “రుద్ర “, “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా…

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ”రాధేశ్యామ్ “ మూవీ మార్చ్ 11 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “ఆదిపురుష్ “మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం “సలార్ “, “ప్రాజెక్ట్ K ” మూవీస్ లో నటిస్తున్నారు. “అర్జున్ రెడ్డి ” మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ అప్ డేట్..!
గత ఏడాది వకీల్ సాబ్, ఈఏడాది భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ కళ్యాణ్ తన సత్తాను మరోసారి బాక్సాఫీస్ వద్ద చూపించారు పవన్. ఇక ఇప్పుడు తన ఫోకస్ నెక్స్ట్ ప్రాజెక్స్ట్ పై పెట్టనున్నారు. ప్రస్తుతం అయితే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది పొంగల్ రేసులో ఈసినిమా ఉంటుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ ఇంకా షూటింగే పూర్తవ్వలేదు. ఈసినిమా ఎప్పుడో మొదలయి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గాలి నాగేశ్వర రావు కు జోడీగా పాయల్ రాజ్ పుత్
విలక్షణ నటుడు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరించనున్నారు . ఈ మూవీ కి మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు.

'ఏజెంట్' లో జాయిన్ అయిన మమ్ముట్టి..!
అక్కినేని వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ కు మొదటి హిట్ కొట్టడానికి చాలా టైమే పట్టింది. వరుసగా మూడు పరాజయాలు అందుకున్నా ఎలాంటి నిరాశ చెందకుండా ఎలాగైనా తన ఫ్యాన్స్ కు సరైన హిట్ అందించాలని వెయిట్ చేశాడు. అలానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లతో ఫైనల్ గా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

"అరబిక్ కుతు"సాంగ్ కు కీర్తి సురేష్ డ్యాన్స్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారారు. “సర్కారు వారి పాట “ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా , “దసరా ” మూవీ లో న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా కీర్తి నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్నారు.మహేష్ బాబు తో ఫస్ట్ టైమ్ , బ్లాక్ బస్టర్ “నేను లోకల్ “మూవీ లో నాని కి జంటగా నటించిన కీర్తి , “దసరా “మూవీ లో రెండవసారి జంటగా నటిస్తున్నారు. “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కు హ్యాట్సాఫ్ - ఎమ్మెల్యే రోజా
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లో హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ హీరో అనిపించుకుంటున్నారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేశ్ తాజాగా "ప్యూర్ లిటిల్ హార్ట్స్'" ఫౌండేషన్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆయన ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడి వారి తల్లిదండ్రుల పాలిట దైవంగా నిలిచారు.మహేశ్ బాబుపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'రాధేశ్యామ్'.. 'థమన్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను లేపారు..!
టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాదు చిన్న సినిమాలకు కూడా థమన్ సాయం చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న డీజే టిల్లు సినిమాకు థమనే బ్యాక్ గ్రౌండ్ అందించాడు.

మారుతి-ప్రభాస్ సినిమా కన్ఫామ్ అయినట్టేనా..!
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ పైనే దృష్టి పెడుతున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలు కూడా కొంత మంది హీరోలకు మాత్రమే కలిసొస్తాయని ఇప్పటికే చూశాం. కానీ ప్రభాస్ మార్కెట్ మాత్రం డిఫరెంట్. తను ఇప్పుడు చిన్న సినిమా తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పాన్ ఇండియా సినిమాలే. మూడు రోజుల్లో రిలీజ్ అవ్వబోయే రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే ఇలా అన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.. ఇంకా సెట్స్ పైకి…

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో పనిలేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కరోనా టైమ్ లో కూడా తన నుండి రెండు సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘అశ్వథ్ధామ’ తరువాత చాలా గ్యాప్ వచ్చినా ఆ తర్వాత ‘వరుడు కావలెను’ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆతర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘లక్ష్య’ వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేయడానికి రెడీ అవుతున్నాడు నాగశౌర్య.

అభిమానుల ప్రేమ ,అభిమానం , సపోర్ట్ కు థ్యాంక్స్ - ప్రభాస్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్…

రిలీజ్ కు ముందే యూఎస్ లో "RRR" హంగామా
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్…

మథర్-డాటర్ మూమెంట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు సంబంధించ విషయాలు కానీ, పిల్లలు సితార, గౌతమ్ లకు సంబంధించిన విషయాలు కానీ ఎప్పటికప్పుడూ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఇక తాజాగా నమ్రత తన సోషల్ మీడియా ద్వారా సితారతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ మథర్-డాటర్ మూమెంట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ ఫొటోలు అందరనీ ఆకట్టుకుంటున్నాయి.

మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి..!
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. అన్యోన్య దాంపత్యం అని కొంతమంది దంపతులను చూస్తే అనాలనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్-స్నేహారెడ్డి ని చూసిన ఎవరికైనా అలా అనాలనే అనిపిస్తుంది. బన్నీ సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలుసు. సినిమాలు షూటింగ్ లంటూ బిజీగా ఉన్నా కుటుంబానికి టైమ్ కేటాయిస్తూనే ఉంటాడు. ఫ్యామిలీతో స్పెషల్ గా ట్రిప్ లకు సైతం వెళుతుంటాడు. ఇక మరోపక్క స్నేహా రెడ్డి కూడా బన్నీకి సపోర్డ్ గా ఉంటూనే పిల్లలను చూసుకుంటూ.. మరోవైపు బిజినెస్ లలో కూడా ఒక చేయి వేస్తూనే బిజీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఈ క్యూట్ కపుల్ సోషల్ మీడియాలో…

ఆది పినిశెట్టి 'క్లాప్' ట్రైలర్ రిలీజ్
ఆది పినిశెట్టి గురించి.. తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర కు ప్రాధాన్యత మాత్రమే చూస్తాడు.. అది హీరోనా, విలనా అని చూడడు. అందుకే హీరోగా చేసి మెప్పించగలడు, విలన్ గా క్రూరంగా చేయగలడు.. మహిళా ప్రాధాన్యత సినిమాల్లో సైతం చేయగలడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రతో రాబోతున్నాడు.