యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో పనిలేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కరోనా టైమ్ లో కూడా తన నుండి రెండు సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘అశ్వథ్ధామ’ తరువాత చాలా గ్యాప్ వచ్చినా ఆ తర్వాత ‘వరుడు కావలెను’ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆతర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘లక్ష్య’ వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేయడానికి రెడీ అవుతున్నాడు నాగశౌర్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 22న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.
#KrishnaVrindaVihari ❤️ is Arriving to Theatres on APRIL 22nd, 2022🎋@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth#KrishnaVrindaVihariOnApr22 🥳 pic.twitter.com/0G3Itkl32T
— Naga Shaurya (@IamNagashaurya) March 7, 2022
కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: