ఆది పినిశెట్టి గురించి.. తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర కు ప్రాధాన్యత మాత్రమే చూస్తాడు.. అది హీరోనా, విలనా అని చూడడు. అందుకే హీరోగా చేసి మెప్పించగలడు, విలన్ గా క్రూరంగా చేయగలడు.. మహిళా ప్రాధాన్యత సినిమాల్లో సైతం చేయగలడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రతో రాబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో క్లాప్ అనే సినిమాతో వస్తున్నాడు ఆది పినిశెట్టి. త్వరలోనే ఈసినిమా రిలీజ్ అవుతుంది. కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కు కూడా చాలా బ్రేకులు పడ్డాయి. ఫైనల్ గా ఓటీటీ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈసినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.
రేసుకి విష్ణు రెడీ, అన్ని ఎమోషన్స్ కలిగిన విష్ణు జర్నీ ని చూడడానికి మీరు కూడా రెడీ అవ్వండి – ఈ Mar 11న SonyLivలొ
Clap, an inspiring sports drama, streaming on SonyLIV from March 11. #ClapOnSonyLIV@AadhiOfficial @ilaiyaraaja @aakanksha_s30 @prithivifilmist pic.twitter.com/e6xi6JRD7r— SonyLIV (@SonyLIV) March 6, 2022
ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, రాందాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























