పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ”రాధేశ్యామ్ “ మూవీ మార్చ్ 11 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “ఆదిపురుష్ “మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం “సలార్ “, “ప్రాజెక్ట్ K ” మూవీస్ లో నటిస్తున్నారు. “అర్జున్ రెడ్డి ” మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ తో హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. స్టైలిష్ మూవీ “సాహో “తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. దేశ, విదేశాలలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.ప్రభాస్ సోషల్ మీడియాలో తన ప్రతీ సినిమాకి సంబంధించిన విశేషాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటారు. తాజాగా ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ లోని ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగి సరికొత్త రికార్డ్ ను సెట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 8 మిలియన్ కు చేరుకుంది. అతి తక్కువ సమయంలో ఆయన ఈ ఫీట్ ను సాధించడం విశేషం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: