సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు సంబంధించ విషయాలు కానీ, పిల్లలు సితార, గౌతమ్ లకు సంబంధించిన విషయాలు కానీ ఎప్పటికప్పుడూ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.
ఇక తాజాగా నమ్రత తన సోషల్ మీడియా ద్వారా సితారతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ మథర్-డాటర్ మూమెంట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ ఫొటోలు అందరనీ ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక మిగిలిన షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇక దీనితో పాటు మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా చేసిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: