విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక , అంకిత కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “సింహాద్రి “మూవీ ని తెరకెక్కించారు. “సింహాద్రి “మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా విలేజెస్ లో ఒక మూవీ ఒక వారం లేదా 10 రోజులు ప్రదర్శించడం గొప్ప. అటువంటిది “సింహాద్రి ” మూవీ ఒక విలేజ్ లో 175 రోజులు ప్రదర్శించబడటం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి విలేజ్ లో అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్ లో “సింహాద్రి ” మూవీ రిలీజ్ అయ్యి 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. “స్టూడెంట్ నెం 1”, “ఆది ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “సింహాద్రి ” మూవీ చూడడానికి చుట్టు ప్రక్కల విలేజెస్ నుండి ప్రేక్షకులు ఎడ్ల బళ్ళ మీద అనంతపల్లి కి వచ్చి ఆ మూవీ ని ఎంజాయ్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: