
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 51


థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "

'తిమ్మరుసు' రిలీజ్ డేట్ ఫిక్స్

బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్

భారీ సెట్స్ తో "డెవిల్ "

కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్

#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్

కృష్ణపట్నం పోర్ట్ లో "ఏజెంట్ "

1970 ల బ్యాక్ డ్రాప్ లో "సలార్ "

జులై 15 'వాలిమై' ఫస్ట్ లుక్..!

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ స్టార్ట్

ఆగష్ట్ లో 'ఆరడుగుల బుల్లెట్'

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫొటో
మళ్లీ మొదలుపెట్టిన 'పుష్ప' రాజ్

"F 3 " మూవీ సెట్స్ లో మెహరీన్

'డెవిల్' గా మారిన కళ్యాణ్ రామ్

'అన్నీ మంచి శకునములే' అంటున్న సంతోష్ శోభన్

హన్సిక కొత్త చిత్రం ప్రారంభం

వినోదం , సందేశంతో "తిమ్మరుసు "
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ , ప్రియాంక జవాల్కర్ జంటగా అసైన్‌మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన లీగల్ క్రైమ్ థ్రిల్లర్ "తిమ్మరుసు "మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ , బ్రహ్మాజీ , ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం "నరగాసురన్ ", "కసడ తపర "(తమిళ ), "వివాహభోజనంబు" (తెలుగు ) మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన "గల్లీ రౌడీ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా "గల్లీ రౌడీ " మూవీ తెరకెక్కింది. బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు.

'తిమ్మరుసు' రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. అందుకే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు చిత్రయూనిట్. ఈనెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేస్తూ, రిలీజ్ డేట్ పోస్టర్ ను వదిలారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్
చదువుకునే రోజుల్లో సింగింగ్ , డ్యాన్సింగ్ , పియానో నేర్చుకున్న కేథరిన్ నల్లి సిల్క్స్ , చెన్నై సిల్క్స్ వంటి పలు సంస్థలకు మోడలింగ్ చేశారు. "శంకర్ ఐ పి ఎస్ "(2010 ) కన్నడ మూవీ తో కేథరిన్ కెరీర్ ప్రారంభించారు. "ది థ్రిల్లర్ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,"చమ్మక్ ఛలో "మూవీ తో టాలీవుడ్ , "మద్రాస్ "మూవీ తో కోలీవుడ్ కు కేథరిన్ కథానాయికగా పరిచయం అయ్యారు.

భారీ సెట్స్ తో "డెవిల్ "
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "బింబిసార "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా "డెవిల్ "మూవీ అనౌన్స్అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ , ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మూవీస్ బ్యానర్స్ పై రూపొందే మూవీస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్
‘ప్రేమమ్’, ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తరవాత సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న మరో మాలయాళ సినిమా రీమేక్ కప్పేల. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఫిదా చేసేశారు. 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో ఈసినిమా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈసినిమాను కూాడా రీమేక్ చేస్తున్నారు.

#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్
వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. ఇక తన తర్వాత సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసినిమా కూడా చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో మేకర్స్ కూడా షూటింగ్ ను జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు అధికారికంగా తెలిపారు.

కృష్ణపట్నం పోర్ట్ లో "ఏజెంట్ "
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

1970 ల బ్యాక్ డ్రాప్ లో "సలార్ "
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “మూవీ ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ ” మూవీస్ షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్న తరుణం లో కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్స్ నిలిచిపోయాయి.

జులై 15 'వాలిమై' ఫస్ట్ లుక్..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘వాలిమై’. పోలీస్ యాక్షన్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. టాకీ పార్ట్ మొత్తం దాదాపు పూర్తి కాగా.. ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. దాదాపు ఏడాదికి పైగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. అయితే…

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ స్టార్ట్
ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి వారసుడు రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రౌడీబాయ్స్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈసినిమా డబ్బింగ్ స్టార్ట్ అయిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన ఇన్స్టా ద్వారా తెలిపింది.

శ్రీవిష్ణు 'భళా తందనాన'.. గరుడ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్‌లో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో ప్రతిసారీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.

ఆగష్ట్ లో 'ఆరడుగుల బుల్లెట్'
యాక్షన్ హీరో గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". 2017 సంవత్సరం జూన్ 9 వ తేదీ రిలీజ్ కావాల్సిన "ఆరడుగుల బుల్లెట్" మూవీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తో నిలిచిపోయింది. ఇక ఇన్నేళ్ల తరువాత ఈసినిమా రిలీజ్ కు మోక్షం కలిగింది. ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈలోపు ఎలాగూ థియేటర్లు రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఓపని అయిపోతుంది అని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాలి.

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫొటో
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్”మూవీ కి విశ్వక్ సేన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం వహించడం విశేషం. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.హీరో విశ్వక్ సేన్ ఫొటో షూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.
మళ్లీ మొదలుపెట్టిన 'పుష్ప' రాజ్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. లాక్ డౌన్ కు ముందే ఈసినిమా చాలావరకూ షూటింగ్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. కరోనా సెకండ్ వేవ్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరిపినా కూడా ఆఖరికి బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మళ్లీ ఇన్ని రోజులకు సెట్స్ పైకి వచ్చారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి…

"F 3 " మూవీ సెట్స్ లో మెహరీన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమన్నా , మెహరీన్ కథానాయికలు కాగా రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'డెవిల్' గా మారిన కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు వరుసపెట్టి సినిమా అప్ డేట్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీనితో పాటు కె.వి గుహన్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా రాబోతున్నట్టు నేడు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా ఈసినిమా తెరకెక్కుతుంది. మరోవైపు తాజాగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.

'అన్నీ మంచి శకునములే' అంటున్న సంతోష్ శోభన్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంతోష్ శోభన్నటనకు గాను మంచి ప్రశంసలే దక్కాయి. అంతేకాదు ఈసినిమా తరువాత సంతోష్ శోభన్ కు వరుస ఆఫర్లు కూడా క్యూలో ఉన్నాయి. అది కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్ ల నుండే. ఇప్పటికే ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

హన్సిక కొత్త చిత్రం ప్రారంభం
బాలనటిగా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన హన్సిక "ఆప్ కా సురూర్" మూవీ తో కథానాయికగా మారారు. సూపర్ హిట్ "దేశముదురు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ "మాప్పిళ్ళై "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.