టాలీవుడ్‌లో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో ప్రతిసారీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతో పాటు ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా కూడా చేస్తున్నాడు. శ్రీవిష్ణుని మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించడానికి డిఫరెంట్ కథతో వస్తున్నాడు చైతన్య. ఇక ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. నేడు అతని పుట్టినరోజు సందర్భంగా ఈసినిమానుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాలో ఆనంద్ బాలి అనే పాత్రలో నటిస్తున్నాడు గరుడ రామ్.
Transforming @GarudaRaam as the notorious #AnandBaali in #BhalaThandanana movie 🔥
Here’s wishing ‘Ramachandra Raju’ a very Happy Birthday 🎉@sreevishnuoffl @chaitanyahead @SaiKorrapati_ @CatherineTresa1 #ManiSharma @sureshragutu1 @SrikanthVissa @VaaraahiCC pic.twitter.com/TQgmvaP7YH
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 7, 2021
కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: