కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘వాలిమై’. పోలీస్ యాక్షన్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. టాకీ పార్ట్ మొత్తం దాదాపు పూర్తి కాగా.. ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. దాదాపు ఏడాదికి పైగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. అయితే ఈనెలలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈనెల 15న ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి దీనిపై అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ సినిమాలో అజిత్ సీబీసీఐడి అధికారిగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ‘బేవ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: