మళ్లీ మొదలుపెట్టిన ‘పుష్ప’ రాజ్

Icon Star Allu Arjun Starrer Pushpa Movie Team To Get Back To Movie Sets Today Post Lockdown,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sukumar,Sukumar,Sukumar Movies,Sukumar New Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Pushpa Telugu Movie Updates,Pushpa Movie News,Pushpa Sond,Pushpa Movie Songs,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie Sets,Allu Arjun Pushpa Movie Shoot,Rashmika Mandanna,Allu Arjun Rashmika Mandanna Movie,Sukumar Latest News,Pushpa Shooting Update,Pushpa Pushpa Raj,Pushpa Movie Team To Get Back To Movie Sets,Pushpa Team Back To Movie Sets,Allu Arjun Pushpa Team Back To Movie Sets Today,Pushpa Team Resume Shooting,Allu Arjun Set To Resume Shooting For Pushpa,Pushpa Movie Team Is Back On Sets,Pushpa Movie Shooting,Pushpa Movie Shooting Update,#Pushpa

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. లాక్ డౌన్ కు ముందే ఈసినిమా చాలావరకూ షూటింగ్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. కరోనా సెకండ్ వేవ్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరిపినా కూడా ఆఖరికి బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మళ్లీ ఇన్ని రోజులకు సెట్స్ పైకి వచ్చారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో ‘పుష్ప’ పార్టు 1కి సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే బన్నీ ఐకాన్ సినిమాను స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను దిల్ రాజు అత్యంత భారీగా నిర్మించనున్నాడు. ఐకాన్ అయిపోయిన తరువాత పుష్ప పార్ట్ 2 మొదలవుతుందని అంటున్నారు. చూడాలి మరి పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ట్ అవుతుందో.. ఐకాన్ తరువాత పుష్ప 2 స్టార్ట్ అవుతుందో.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ‘పుష్ప’ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here