ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి వారసుడు రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రౌడీబాయ్స్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈసినిమా డబ్బింగ్ స్టార్ట్ అయిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన ఇన్స్టా ద్వారా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ఈ చిత్రాన్ని ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష డైరెక్ట్ చేయనున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా రిలీజ్ కు రెడీగా లేకపోవడం.. మరోవైపు థియేటర్లు లేకపోవడం వల్ల రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్ కు వస్తున్నాయి కాబట్టి త్వరలోనే అన్ని పనులు కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో అనుపమ 18 పేజీస్, కార్తికేయ సినిమాలతో నటిస్తుంది. అవి కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు తమిళ మూవీస్ లో కూడా నటిస్తుంది. అంతేకాదు ఒక మలయాళ మూవీ కూడా చేస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: