టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంతోష్ శోభన్నటనకు గాను మంచి ప్రశంసలే దక్కాయి. అంతేకాదు ఈసినిమా తరువాత సంతోష్ శోభన్ కు వరుస ఆఫర్లు కూడా క్యూలో ఉన్నాయి. అది కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్ ల నుండే. ఇప్పటికే ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు నందిని రెడ్డి తో కూడా ఒక సినిమా చేయనున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు “అన్నీ మంచి శకునములే” అనే టైటిల్ ను ఖరారు చేశారు. స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
To some new beginnings… ఇక అన్నీ మంచి శకునములే ❤️#AnniManchiSakunamulehttps://t.co/FRtdGGA17Q@santoshshobhan @MalvikaNairOffl @nandureddy4u @MickeyJMeyer @KurapatiSunny @SwapnaCinema @SwapnaDuttCh #PriyankaDutt #MitraVindamovies pic.twitter.com/JOKhZW1jfM
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 5, 2021
వీటన్నిటితో పాటుగా సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ప్రేమ్ కుమార్ అనే ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాదు ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈసినిమాలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కృష్ణ చైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: