‘డెవిల్’ గా మారిన కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram Announces His Upcoming Movie Titled Devil,Devil First Look,Naveen Medaram,Naveen Medaram Movies,Naveen Medaram and Kalyan Ram,Kalyan Ram And Naveen Medaram Film,Kalyan Ram And Naveen Medaram New Movie,Kalyan Ram And Naveen Medaram Movie,Kalyan Ram And Naveen Medaram Devil,Devil Movie,Devil,Devil Telugu Movie,Devil Movie Updates,Devil Movie Latest Updates,Devil Movie news,Devil Latest Telugu Movie 2021,Devil Kalyan Ram,Kalyan Ram Devil,Devil First Look Poster,Kalyan Ram Devil First Look,Kalyan Ram Devil First Look Poster,Devil Movie First Look Poster,Devil Movie First Look,NKR 21 Movie Title Devil,NKR 21 First Look,NKR 21 Movie Title And First Look,Devil First Look Out,Kalyan Ram New Movie Devil,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Happy Birthday Kalyan Ram,HBD Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest News,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram Next Movie,Kalyan Ram Next Projects,Kalyan Ram Latest Movie Updates,Happy Birthday NKR,NKR 21,NKR 21Movie,NKR 21 Update,NKR 21 Movie Updates,NKR 21 Movie Latest Update,,#DevilFirstLook,#HBDNandamuriKalyanRam

కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు వరుసపెట్టి సినిమా అప్ డేట్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీనితో పాటు కె.వి గుహన్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా రాబోతున్నట్టు నేడు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా ఈసినిమా తెరకెక్కుతుంది. మరోవైపు తాజాగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ఇచ్చారు. ‘డెవిల్’ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనికి ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ తుపాకీ పట్టుకొని రైలుకు వేలాడుతూ కనిపిస్తున్నాడు. ఇందులో బ్లేజర్ మరియు పంచెకట్టు ధరించి.. పొడవాటి జుట్టు గడ్డం మీసాలతో మ్యాన్లీగా ఉన్నాడు. ట్రైన్ మీద ఇండియన్ ఫ్లాగ్ తో కొందరు వ్యక్తులు ఉండటం చూస్తుంటే పేట్రియాటిక్ నేపథ్యంలో ఈసినిమా రాబోతున్నట్టు అర్థమవుతుంది.

కాగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

మరి మూడు సినిమాలు వేటికవే డిఫరెంట్ కాన్సెప్ట్స్. మొత్తానికి కళ్యాణ్ రామ్ ఈసారి డిఫరెంట్ గా చేయడానికి ఫిక్స్ అయినట్టున్నాడు. మరి వీటిలో ఎన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తాయో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =