
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 41


7డేస్ 6 నైట్స్.. షూటింగ్ కంప్లీట్

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్

"అఖండ"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

బీస్ట్ థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూజా హెగ్డే

'RC 15' కోసం మరో డైరెక్టర్..!

"అర్జున్ రెడ్డి "పై షాలిని పాండే ఫీలింగ్స్

"శ్యామ్ సింగ రాయ్" మూవీ అప్ డేట్

"DEAR మేఘ" సెన్సార్ పూర్తి

'ఫ్యామిలీ మ్యాన్ 3' లో చేస్తున్నా

"#RC15" మూవీ లాంచింగ్ డేట్ ఫిక్స్

"RX 100 "హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్

మీరా జాస్మిన్ రీఎంట్రీ

'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా..!

"వరుడు కావలెను "మూవీ టీజర్ రిలీజ్ డేట్
సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ"వరుడు కావలెను "మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

7డేస్ 6 నైట్స్.. షూటింగ్ కంప్లీట్
నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఎమ్.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే డర్టీ హరి సినిమాతో హిట్ అందుకున్న ఎమ్ ఎస్ రాజు ఇప్పుడు మరో యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాతే సెట్స్ పైకి తీసుకెళ్లాడు ఎమ్ ఎస్ రాజు. అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోంది. ఇక ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.

"రౌడీ బాయ్స్"ఈవెంట్ లో అనుపమ అల్లరి
“అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం”తళ్ళిపోగాదే ” తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” , "రౌడీ బాయ్స్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

ఫైనల్లీ ఓటీటీలో 'టక్ జగదీష్'.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇన్ని రోజుల సస్పెన్స్ తరువాత టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఈసినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడగా థియేటర్లు ఓపెన్ అయినా కూడా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని అన్నారు. దీంతో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేక థియేటర్లలోనే రిలీజ్ అవుతుందా అన్న కన్ఫ్యాజన్ లో ఉన్నారు. అయితే మ్యాగ్జిమమ్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహాసముద్రం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు.. అలానే హే రంభ అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 14వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

"అఖండ"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

బీస్ట్ థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూజా హెగ్డే
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో కెరీర్ లో చాలా బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే తన మూడో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా నిన్నటితో తన షూటింగ్ ను ముగించుకొని ముంబైకు చేరుకుంది ఈ భామ.

'RC 15' కోసం మరో డైరెక్టర్..!
శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఈసినిమాలో నటించే హీరోయిన్ ను కూడా కన్ఫామ్ చేశారు. ఎంతోమంది పేర్లు తెరపైకి రాగా ఫైనల్ గా కియారా ను రామ్ చరణ్ కు జోడీగా సెలక్ట్ చేశాడు శంకర్. ఎలాగూ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయింది కాబట్టి త్వరలోనే శంకర్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు.

"సీతా మనోహర శ్రీ రాఘవ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అందాల నటుడు హరనాథ్ పౌరాణిక పాత్రలలో కూడా తనదైన ముద్ర వేశారు. రొమాంటిక్ హీరోగా హరనాథ్ ని అభిమానించే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆయన నటనను , నడకను వాళ్లు ఎంతగానో ఇష్టపడేవారు.ఇప్పటికీ చాలామంది అభిమానులు హరనాథ్ ను మరిచిపోలేదు. ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎందుకు ఇండస్ట్రీకి రాలేదని అనుకునేవారు ఉన్నారు. ఇప్పుడు హరనాథ్ తమ్ముడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

"అర్జున్ రెడ్డి "పై షాలిని పాండే ఫీలింగ్స్
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన "అర్జున్ రెడ్డి "మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జబల్‌పూర్ సుందరి షాలిని పాండే , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ స్టేటస్ అందుకున్నారు. "అర్జున్ రెడ్డి" సినిమాతో వచ్చిన క్రేజ్ తో షాలినిపాండే పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. "మహానటి ", "118 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. షాలిని ప్రస్తుతం "జయేశ్ భాయ్ జోర్దార్", "మహారాజా "హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"శ్యామ్ సింగ రాయ్" మూవీ అప్ డేట్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"DEAR మేఘ" సెన్సార్ పూర్తి
వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ , సోరింగ్ ఎలిఫెంట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అరుణ్ ఆదిత్, మేఘ ఆకాష్ జంటగా తెలుగు , తమిళ భాషలలో రూపొందిన "DEAR మేఘ" మూవీ సెప్టెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. అర్జున్ సోమయాజులు ఒక కీలక పాత్రలో నటించారు. కన్నడ హిట్ "దియా "మూవీ కి రీమేక్ గా రూపొందిన "DEAR మేఘ" మూవీ కి హరి గౌర సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో "ఆదిపురుష్ "
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

'ఫ్యామిలీ మ్యాన్ 3' లో చేస్తున్నా
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈసిరీస్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా... ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అంతకంటే ఎక్కువ సక్సెస్ అయింది. ఇక ఈసిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అంతేకాదు దానికి ఫలితంగా ఇటీవల తనకు అవార్డ్ కూడా దక్కింది.

"#RC15" మూవీ లాంచింగ్ డేట్ ఫిక్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

ప్రభాస్ సినిమాపై సామ్.. నాగ్ అశ్విన్ ను అడుగుతా..!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది కూడా. అంతేకాదు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు కూడా. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా ఇతర నటీ నటుల వరకూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

"RX 100 "హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన “RX 100 “మూవీ 2018 సంవత్సరం జూలై 12 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తికేయ , పాయల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.RX 100 “మూవీ హీరో కార్తికేయ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీరా జాస్మిన్ రీఎంట్రీ
"సూత్రధారన్ "(2001 ) మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన మీరా జాస్మిన్ "రన్" మూవీ తో కోలీవుడ్ , టాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో మీరాజాస్మిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "అమ్మాయి బాగుంది ", భద్ర ", "యమగోల మళ్ళీ మొదలయ్యింది ", "గోరింటాకు ", "పందెం కోడి "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. "మోక్ష "(2013 ) మూవీ తరువాత మీరాజాస్మిన్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.

'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా..!
కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది అని మేకర్స్ కూడా తొందరపడుతున్నారు. అందుకే వారానికి దాదాపు అరడజను వరకూ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు పోటీకి సిద్దంగా ఉండగా.. సెప్టెంబర్ 3న కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే అదే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.