టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో కెరీర్ లో చాలా బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే తన మూడో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా నిన్నటితో తన షూటింగ్ ను ముగించుకొని ముంబైకు చేరుకుంది ఈ భామ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా..ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి విజయ్ కు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. మరి చాలా ఏళ్ల తరువాత పూజా హేగ్డే తమిళ్ లో చేస్తుంది. మరి ఈసినిమాతో పూజా హెగ్డే అక్కడ కూడా బిజీ అయిపోతుందేమో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: