నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది కూడా. అంతేకాదు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు కూడా. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా ఇతర నటీ నటుల వరకూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీపికాతో పాటు మరో కీలక పాత్రలో సమంతను కూడా తీసుకున్నట్టు ఈమధ్య వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలపై తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది సమంత. నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తున్నట్టు ఎలా రూమార్స్ వచ్చాయో తెలీదు.. కానీ ఈసినిమాలో అవకాశం వస్తే బావుండేది.. ఇప్పుడే నాగ్ అశ్విన్ కు మెసేజ్ చేస్తా నన్ను ఈసినిమాలో ఎందుకు తీసుకోలేదో అని కామెడీ చేసింది. అంతేకాదు ప్రస్తుతానికైతే శాకుంతలం సినిమానే చేస్తున్నా అని.. ఇంకా ఏ కొత్త సినిమాను అంగీకరించలేదని తెలిపింది. మరి సమంత కోసమైనా నాగ్ అశ్విన్ ఏదో ఒక పాత్ర క్రియేట్ చేస్తాడేమో చూద్దాం..
కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: