సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన “అర్జున్ రెడ్డి “మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జబల్‌పూర్ సుందరి షాలిని పాండే , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ స్టేటస్ అందుకున్నారు. “అర్జున్ రెడ్డి” సినిమాతో వచ్చిన క్రేజ్ తో షాలినిపాండే పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. “మహానటి “, “118 ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. షాలిని ప్రస్తుతం “జయేశ్ భాయ్ జోర్దార్”, “మహారాజా “హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి” విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా షాలిని పాండే పలు విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమా సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కే దక్కుతుందనీ, తాను” అర్జున్ రెడ్డి”కి రుణపడి ఉంటాననీ , తనకు నటిగా ఈ చిత్రం మ్యాప్ లాగా పనిచేసిందనీ ,తన స్థాయికి మించి ఉత్తమ నటన కనబరిచే ప్రయత్నం చేశాననీ , తన యాక్టింగ్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించి,తన కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందనీ , “అర్జున్ రెడ్డి” అందించిన విజయం బహుముఖ కళాకారిణిగా గుర్తింపు పొందాలనే అభిరుచికి ఆజ్యం పోసిందనీ , ఈ సినిమా ఓ నటిగా తన వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా నమ్మకాన్ని అందించిందనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: