శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“#RC15” మూవీ లో పాత్రకై రామ్ చరణ్ ప్రిపరేషన్ లో ఉన్నారు. సెప్టెంబర్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం భారీ సెట్ ని నిర్మించారు. తొలిగా రామ్ చరణ్ -కియారా అద్వానీలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. “పుష్ప”మూవీ విలన్ ఫహద్ ఫాసిల్ ఇందులో విలన్ గా నటించే అవకాశం ఉంది. నేటి జనరేషన్ కి తగ్గట్టుగా , సామాజిక రాజకీయాంశాల్ని టచ్ చేస్తూ తెరకెక్కనున్న”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: