“సూత్రధారన్ “(2001 ) మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన మీరా జాస్మిన్ “రన్” మూవీ తో కోలీవుడ్ , టాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో మీరాజాస్మిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “అమ్మాయి బాగుంది “, భద్ర “, “యమగోల మళ్ళీ మొదలయ్యింది “, “గోరింటాకు “, “పందెం కోడి “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. “మోక్ష “(2013 ) మూవీ తరువాత మీరాజాస్మిన్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనదైన నటనతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన మీరా 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైయ్యారు. . అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా తన భర్తతో విడిపోయారు. జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. కొంతకాలం క్రితం ఓ మలయాళ సినిమాలో గెస్ట్ రోల్‌లో మీరా కనిపించారు. . అయితే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారనీ , రీ ఎంట్రీ కోసం మీరా జిమ్ లో వర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయ్యారనీ సమాచారం. సీనియర్ హీరోయిన్స్ భూమిక, స్నేహల మాదిరిగా మీరా సెకండ్ ఇన్సింగ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: