
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 37


టాలీవుడ్ లో బిజీగా ధనుష్

రాశీఖన్నా ప్లెజెంట్ లుక్

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటో

ఫైనల్ షెడ్యూల్ లో 'సామాన్యుడు'

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా

గోవాలో 'లైగర్' యాక్షన్

అఫీషియల్.. 'సీత' గా కంగనా

'పెళ్లి సందD' టీజర్ రిలీజ్

"రీసౌండ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

"తలైవి "మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

రెజీనా 'నేనే నా' ట్రైలర్ రిలీజ్

హాఫ్ శారీలో " సీటీమార్"బ్యూటీ దిగంగన

జిమ్ లో హీరో రామ్

'స్వాతిముత్యం' గా గణేష్ బెల్లంకొండ
అల్లు అర్జున్ సింప్లిసిటీ

'ఎఫ్3' షూటింగ్ అప్ డేట్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకూ సగానికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకోగా మిగిలిన భాగాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదట మైసూర్ లో…

"మాచర్ల నియోజక వర్గం "లో సముద్ర ఖని ద్విపాత్రాభినయం ?
పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని, పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. “నాలో “, శంభో శివశంభో “, “జెండాపై కపిరాజు “మూవీస్ తో సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “అల .. వైకుంఠపురము లో ..”,”క్రాక్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, సర్కారు వారి పాట” తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. సముద్ర ఖని విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

టాలీవుడ్ లో బిజీగా ధనుష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో ధనుష్ ప్రస్థుహం ఒక , హిందీ , ఒక ఇంగ్లీష్ , రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. "ఆడుకాలం" , "అసురన్" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ధనుష్ నటుడే కాకుండా నిర్మాత , దర్శకుడు , స్క్రీన్ రైటర్ , సింగర్ , లిరిసిస్ట్ కూడా. టాలెంటెడ్ హీరో ధనుష్ ఇప్పుడు కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

ఎన్టీఆర్-కొరటాల సినిమా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో లాంచ్..!
ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేసి ఫ్రీగా ఉన్నాడు. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం రాలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా ప్రారంభానికి ఇంకా లేట్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా లాంచ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలు పెట్టాలనే…

రాశీఖన్నా ప్లెజెంట్ లుక్
సూపర్ హిట్ "మనం "మూవీ లో అతిధి పాత్రలో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుసలాడే" మూవీ తో కథానాయికగా మారారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.

'రిపబ్లిక్' రమ్యకృష్ణ బర్త్ డే పోస్టర్ రిలీజ్
సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ వెళుతుంది. ఇందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఇన్ని రోజులు ప్రేమకథలతో అలరించిన సాయి తేజ్ ఇప్పుడు పొలిటికల్ నేపథ్యంలో వస్తున్నాడు. ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి లుక్ విడుదల చేశారు. ఇందులో విశాఖ వాణి అనే పవర్ ఫుల్ పాత్రలో…

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటో
బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ తరువాత కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. కియారా ఇప్పుడు భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "#RC15" తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

ఫైనల్ షెడ్యూల్ లో 'సామాన్యుడు'
శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విశాల్ కెరీర్‌లో 31వ సినిమాగా.. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే విశాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సామన్యుడు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెకండ్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా చివరి షెడ్యూల్ ను తాజాగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని విశాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా
ఈ మధ్య హీరోలు, డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే కదా. కొంతమంది హీరోలైతే వాళ్ళ సినిమాలను వాళ్లే నిర్మించుకుంటున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా యంగ్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు, సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల తన బ్యానర్ స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేయడానికి సిద్దమైపోయాడు. ఇంతకు ముందు త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు తన సొంత…

గోవాలో 'లైగర్' యాక్షన్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి.కరోనా వల్ల పలుమార్లు ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా.. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో విజయ్ కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను అది కూడా నెట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షెడ్యూల్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఫారిన్ కు వెళ్లనున్నారట.

అఫీషియల్.. 'సీత' గా కంగనా
బాలీవుడ్ క్వీన్, మణికర్ణిక, తలైవి ఇప్పటికే అర్ధమయిఉంటుంది కదా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఇంకెవరూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించే. ఇటీవలే తలైవితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా ఇప్పుడు సీత అవతారం ఎత్తనుంది. గత కొంతకాలంగా కంగనా సీత పాత్రలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. కానీ ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

'పెళ్లి సందD' టీజర్ రిలీజ్
గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'పెళ్లి సందD'. పాత సినిమా పెళ్లిసందడిలో శ్రీకాంత్ నటించగా ఇప్పుడు ఈ మోడ్రన్ పెళ్లి సందD తో రోషన్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. నేడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ ను బట్టి ఇందులో రోషన్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా మనకు కనిపిస్తున్నాడు. అంతేకాదు రోషన్ యాక్షన్, డ్యాన్స్ అన్నీ టీజర్ లో చూపించారు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకునేలాగే…

"రీసౌండ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
లాంగ్ గ్యాప్ తరువాత సాయి రామ్ శంకర్ ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ అమృత వర్షిణి క్రియేషన్స్ , శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ , రియల్ రీల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్ ఎస్ మురళీకృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది. రాశీ సింగ్ కథానాయిక కాగా అరవింద్ కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.

"తలైవి "మూవీపై రజనీకాంత్ ప్రశంసలు
విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, ఎమ్ జి ఆర్ గా అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్, జానకి రామచంద్రన్ గా మధుబాల, శశికళగా పూర్ణ , జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

రెజీనా 'నేనే నా' ట్రైలర్ రిలీజ్
‘ఎస్. ఎం. ఎస్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రెజీనా ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ రేటు కాస్త తక్కువగా ఉన్నా కూడా రెజీనా కు మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈమధ్య 'ఎవరు' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కూడా చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు మాత్రం తన ధోరణిని మార్చేసి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితంకాకుండా పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రాబోతుంది.

హాఫ్ శారీలో " సీటీమార్"బ్యూటీ దిగంగన
కామెడీ ఎంటర్ టైనర్ "ఫ్రై డే" మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ముంబై బ్యూటీ దిగంగన , "హిప్పీ "మూవీ తో టాలీవుడ్ , "ధనుసు రాశి నేయర్గాలే " మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. "వలయం ", "సీటీమార్ "మూవీస్ లో దిగంగన తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "సీటిమార్ " మూవీ ఘన విజయం సాధించడం తో ఆ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన దిగంగన సంతోషం గా ఉన్నారు.

జిమ్ లో హీరో రామ్
హీరో రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటున్న హీరో రామ్ తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'స్వాతిముత్యం' గా గణేష్ బెల్లంకొండ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి గణేష్ బెల్లంకొండ ఎప్పుడో అరంగేట్రం చేయాలి కానీ అనుకోని పరిస్థితుల్లో మొదటి సినిమా ఆగిపోయింది. ఇక వెంటనే ఎలాంటి నిరాశ చెందకుండా రెండో సినిమాను లైన్ లో పెట్టేసి ఇప్పుడు దాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు గణేష్ బెల్లంకొండ. లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకత్వంలో గణేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. త్వరలోనే షూట్ పూర్తి కానుంది.
బోయపాటికి కూడా డేట్స్ ఇచ్చేసిన 'బన్నీ'
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది..వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అల్లు అర్జున్ సింప్లిసిటీ
దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అశేష అభిమానులున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో 2 భాగాలుగా "పుష్ప " మూవీ తెరకెక్కుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ , దాక్కో దాక్కో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.