హీరో రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటున్న హీరో రామ్ తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RamPothineni looks chiseled in this latest picture💪@ramsayz #TeluguFilmNagar pic.twitter.com/iNKIkLX6Wd
— Telugu FilmNagar (@telugufilmnagar) September 13, 2021
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి , సీనియర్ హీరోయిన్ నదియా కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జిమ్‌లోరామ్ పోతినేని చెమట చిందిస్తున్నారు. కష్టపడి మరీ కండలు పెంచుతున్నారు. ఈ మూవీ లో హీరో రామ్ ఒక కొత్త లుక్ లో కనిపించనున్నారు. హీరో రామ్, హీరోయిన్ కృతి శెట్టి, నదియా తదితరులపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. త్వరలో యాక్షన్ సీన్లు తెరకెక్కించనున్నారు. వాటి కోసం రామ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: