సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ వెళుతుంది. ఇందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఇన్ని రోజులు ప్రేమకథలతో అలరించిన సాయి తేజ్ ఇప్పుడు పొలిటికల్ నేపథ్యంలో వస్తున్నాడు. ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి లుక్ విడుదల చేశారు. ఇందులో విశాఖ వాణి అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing our #VishakhaVani a.k.a @meramyakrishnan a very Happy Birthday 🎂🎉.#REPUBLIC #RepublicFromOct1st@IamSaiDharamTej @aishu_dil @devakatta @IamJagguBhai #ManiSharma @mynnasukumar @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 pic.twitter.com/uIEuZBJjSo
— #ThankYouCollector (@devakatta) September 15, 2021
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు తో పాటు రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అక్టోబర్ 1న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: