ఈ మధ్య హీరోలు, డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే కదా. కొంతమంది హీరోలైతే వాళ్ళ సినిమాలను వాళ్లే నిర్మించుకుంటున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా యంగ్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు, సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల తన బ్యానర్ స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేయడానికి సిద్దమైపోయాడు. ఇంతకు ముందు త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు తన సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఇటీవలే జాతిరత్నాలు సినిమాతో పెద్ద కమర్షియల్ హిట్ కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఆయన ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్రివిక్రమ్ ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఆయన సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక విషయాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
Sithara Entertainments in association with @Fortune4Cinemas brings you the young sensation @NaveenPolishety in a brand new incarnation.
Directed by #KalyanShankar & Produced by @vamsi84 & #SaiSoujanya✨
Your best dose of Fun & Entertainment, Loading Soon! 🤩@SitharaEnts #NP4 pic.twitter.com/GDQIndDXNQ
— Sithara Entertainments (@SitharaEnts) September 15, 2021
కాగా జాతి రత్నాలు డైరెక్షన్ టీమ్ లో పనిచేసిన కళ్యాణ్ శంకర్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: