శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విశాల్ కెరీర్‌లో 31వ సినిమాగా.. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే విశాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సామన్యుడు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెకండ్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా చివరి షెడ్యూల్ ను తాజాగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని విశాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Final Schedule of #VVS & #Saamanyudu Starts Today !!!#VVSFromDecember#VeerameVaagaiSoodum#SaamanyuduFromDecember pic.twitter.com/7Yrhds76De
— Vishal (@VishalKOfficial) September 14, 2021
కాగా ఈసినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదలచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: