
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 25


"ధమాకా " మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
'గామి' టీమ్ కు బన్నీ స్పెషల్ విషెస్..!

'వరుడు కావలెను' ట్రైలర్ రిలీజ్

‘ఎఫ్ 3’ షూట్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన్

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరుడు కావలెను'

"సీతామనోహర శ్రీరాఘవ"మూవీ షూటింగ్ ప్రారంభం

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!

"మనుచరిత్ర"మూవీ షూటింగ్ పూర్తి

"నాట్యం "మూవీ పై చిరంజీవి ప్రశంసలు

"రాధేశ్యామ్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్

అభిమానులతో పూజాహెగ్డే చిట్ చాట్

ప్రగ్య జైస్వాల్ లేటెస్ట్ ఫొటో

"బుజ్జీ.. ఇలారా"మూవీ టీజర్ రిలీజ్

'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్

'సలార్' లో మలయాళం స్టార్..!

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ

టాప్ ప్రొడ్యూసర్ తో శిరీష్ కొత్త సినిమా..!
అల్లు శిరీష్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చిన శిరీష్.. ఇప్పటివరకూ మరొక సినిమాను చేయలేదు. ఇక మధ్యలో కరోనా కూడా రావడంతో దాదాపు అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఇక ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్…

"ధమాకా " మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.
'గామి' టీమ్ కు బన్నీ స్పెషల్ విషెస్..!
ఈమధ్య పెద్ద హీరోలు చిన్న హీరోలకు అలానే చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలపై సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక అందులో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు చిత్రయూనిట్ ను పిలిచి మరి అభినందిస్తుంటాడు బన్నీ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మరో యంగ్ హీరోకు అలాగే తన సినిమాపై స్పందించి స్పెషల్ గా విషెస్ అందించారు. ఆ హీరో.. ఆ సినిమా ఏదో కాదు.. విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గామి సినిమా.

'వరుడు కావలెను' ట్రైలర్ రిలీజ్
నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

'ఫ్యామిలీ డ్రామా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ఆ సినిమాలో తన నటనకు గాను మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దాంతో సుహాస్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.. ఇక సుహాస్ కూడా అదే జోష్ తో ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఎలాంటి హడావుడి లేకుండానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. సైకో కిల్లర్‌గా సుహాస్ కనిపించిన తీరు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను కూడా పెంచేశారు. ఇక తాజాగా…

‘ఎఫ్ 3’ షూట్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన్
ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 3తో మరోసారి నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈసారి సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు చాలా వరకూ పూర్తయింది.. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలిఉంది.

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ
"సింహ స్వప్నం" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన జగపతిబాబు పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న జగపతి బాబు సూపర్ హిట్ "లెజెండ్ " మూవీ తో విలన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి జగపతిబాబు తెరపై కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. .జగపతి బాబు ప్రస్తుతం "గుడ్ లక్ సఖి ", "పుష్ప ", "సలార్ ", "గని ", "లక్ష్య " మూవీస్ , ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరుడు కావలెను'
యంగ్ హీరో నాగశౌర్య కూడా ఫుల్ స్పీడుమీదున్నాడు. ఒకదాని తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా కూడా ఒకటి. ఈసినిమా కూడా సిద్దంగా ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా పండుగకు విడుదల చేయాలనుకున్నారు. కానీ దసరాకు చాలా సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. ఇక చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

"సీతామనోహర శ్రీరాఘవ"మూవీ షూటింగ్ ప్రారంభం
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అందాల నటుడు హరనాథ్ పౌరాణిక పాత్రలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.వందన మూవీస్ బ్యానర్ పై దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వంలో విరాట్ రాజ్ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” మూవీ తెరకెక్కుతుంది . రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. విరాట్ రాజ్ బర్త్ డే సందర్భంగా “సీతామనోహర శ్రీరాఘవ” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

"శ్యామ్ సింగ రాయ్ " మూవీ లో సాయిపల్లవి స్పెషల్ సాంగ్
నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన "లవ్ స్టోరి"మూవీ ఘనవిజయం సాధించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన "శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!
మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, రెండు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉండటం, రీసెంట్ గా డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే కదా. దసరా పండుగ రోజు సాయి తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అందుకుగాను మెగా కాంపౌండ్ మొత్తం సాయ్ తేజ్ కు వెల్ కమ్ చెప్పారు. అంతేకాదు తేజ్ హెల్త్ అప్ డేట్స్ కూడా మెగా హీరోలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సాయి తేజ్ ను కలువగా తాాజాగా హరీష్ శంకర్ కూడా తేజ్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నా బ్రదర్ సాయ్ తేజ్ ను కలవడం జరిగింది.. తను చాలా ఫిట్ గా ఉన్నాడు.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా…

"మనుచరిత్ర"మూవీ షూటింగ్ పూర్తి
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పణలో ఆపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భరత్ కుమార్ పి దర్శకత్వంలో “చూసీ చూడంగానే” మూవీ ఫేమ్ శివ కందుకూరి , మేఘ ఆకాష్ జంటగా “మనుచరిత్ర”మూవీ తెరకెక్కింది. ధనంజయ్ , ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.

"నాట్యం "మూవీ పై చిరంజీవి ప్రశంసలు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్స్ పై రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన "నాట్యం "మూవీ 22 వ తేదీ రిలీజ్ కానుంది. కమల్ కామరాజు , రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్ , భానుప్రియ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

"రాధేశ్యామ్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "రాధేశ్యామ్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అభిమానులతో పూజాహెగ్డే చిట్ చాట్
తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన“ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

ప్రగ్య జైస్వాల్ లేటెస్ట్ ఫొటో
“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

"బుజ్జీ.. ఇలారా"మూవీ టీజర్ రిలీజ్
రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి , జి . నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై "గరుడవేగ" అంజి దర్శకత్వంలో సునీల్ - ధన్ రాజ్ ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ ట్యాగ్ లైన్. తో తెరకెక్కిన "బుజ్జీ.. ఇలారా"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ధన్ రాజ్ సీఐ కేశవ్ నాయుడు, మహమ్మద్ ఖయ్యుమ్ అనే పోలీస్ గా సునీల్ నటించిన ఈ మూవీ లో చాందిని తమిళరసన్ , పోసాని కృష్ణమురళి , శ్రీకాంత్ అయ్యర్ , సత్యకృష్ణ , వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.

'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలను చేశాడు. ఇక ఇప్పుడు తనయుడు ఆకాష్ పూరి సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు పూరీ. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. నిజానికి ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న…

'సలార్' లో మలయాళం స్టార్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా.మరోవైపు ప్రభాస్ పుట్టినరోజు కూడా రానుండటంతో ఈసినిమా నుండి కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ
అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన "రొమాంటిక్" మూవీ ని దీపావళి సందర్భంగా నవంబర్4వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని అక్టోబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.