కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ఆ సినిమాలో తన నటనకు గాను మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దాంతో సుహాస్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.. ఇక సుహాస్ కూడా అదే జోష్ తో ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఎలాంటి హడావుడి లేకుండానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. సైకో కిల్లర్‌గా సుహాస్ కనిపించిన తీరు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను కూడా పెంచేశారు. ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ 29న ఈసినిమాను సోని లివ్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీరు ఎప్పుడు చూడని ఒక ఫామిలీ డ్రామా మీ ముందుకు వస్తుంది. వాళ్ళ గురించి శాంపిల్ చూడండి.
Watch Family Drama trailer now on SonyLIV ▶️ https://t.co/VhLAPq6gyf#FamilyDramaonSonyLIV @ActorSuhas #MeherTej @TJKasarapu @pooja_kiran @SrutiNori #Ajay #Sanjay @RamakrishnaArr2 pic.twitter.com/CikquF5akL— Telugu FilmNagar (@telugufilmnagar) October 20, 2021
కాగా ఈసినిమాలో పూజా కిరణ్, అనుషా నూతుల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్టోరి, స్క్రీన్ ప్లే ని మెహెర్ తేజ్ మరియు షణ్ముఖ ప్రసాంత్ లు అందిస్తున్నారు. అజయ్ అండ్ సంజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























