శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్స్ పై రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన “నాట్యం “మూవీ 22 వ తేదీ రిలీజ్ కానుంది. కమల్ కామరాజు , రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్ , భానుప్రియ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ..నాట్యం సినిమా చాలా చక్కగా అనిపించిందనీ , మంచి ఫీలింగ్‌ను కలిగించిందనీ , దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు కథను అందంగా చూపించారనీ , ఇలాంటి చిత్రాలు అనగానే మనకు కె. విశ్వనాథ్ గారే గుర్తొస్తారనీ, ఆయనని స్ఫూర్తిగా తీసుకునే ఈ సినిమాను తీసినట్టు తనకు అనిపిస్తోందనీ , మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉందనీ , ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాననీ , రేవంత్, సంధ్యా రాజు ఇద్దరూ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ చిత్రం హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ , చిన్న వయసు వాడైనా సరే దర్శకుడు రేవంత్ తన డెబ్యూగా ఇలాంటి సినిమాను తీశారనీ , ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుందనీ , “శంకరాభరణం” సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదనీ , అదో క్లాసిక్ చిత్రం. అలానే “నాట్యం” సినిమాకు కూడా ప్రజాశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాననీ, ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలనీ , చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.