
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 26


'విశాల్ 32' తెలుగు టైటిల్ రిలీజ్

'ఎఫ్ 3'భారీ షెడ్యూల్ కంప్లీట్

"గుడ్ లక్ సఖి " మూవీ నవంబర్ లో రిలీజ్

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి

పూజాహెగ్డే మనసులో మాట

"#RAPO19 " సెకండ్ షెడ్యూల్ పూర్తి

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్

'గామి' గా వస్తున్న విశ్వక్ సేన్

బాలీవుడ్ ఎంట్రీ పై 'అఖిల్' రియాక్షన్..!

"F 3" మూవీ దసరా స్పెషల్ వీడియో రిలీజ్

'అన్నాత్తే' టీజర్ రిలీజ్

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్

పాయల్ రాజ్ పుత్ క్రియేటివిటీ షో

హిందీ భాషలో భారీగా "ఆచార్య "రిలీజ్

నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం

దసరాకు "#NANI 29 " మూవీ అనౌన్స్ మెంట్

దసరాకు 'నాని 29' అనౌన్స్ మెంట్

'మంచి రోజులు వచ్చాయి' ట్రైలర్ రిలీజ్

పక్కా ప్లాన్ తో 'RC 15' షూటింగ్..!
శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాకోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో ఉండటంతో శంకర్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను పక్కా ప్లాన్ తో శంకర్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ను పూణెలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనికోసం అక్కడ ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ ను…

'విశాల్ 32' తెలుగు టైటిల్ రిలీజ్
ప్రస్తుతం తెలుగు సినిమాలు తమిళ్ లో అలాగే తమిళ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవ్వడం చూస్తునే ఉన్నాం. ఇక తమిళ్ హీరోలకు అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అలానే తెలుగులో కూడా చాలా మంది అభిమానులు సొంతం చేసుకున్నవాళ్లు ఉన్నారు. అందుకే వారి సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే విశాల్ కూడా తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు.

'ఎఫ్ 3'భారీ షెడ్యూల్ కంప్లీట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇందులో కూడా వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల షూట్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. గత కొద్దిరోజులుగా హైద్రాబాద్ లో ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ లాంగ్…

"గుడ్ లక్ సఖి " మూవీ నవంబర్ లో రిలీజ్
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. "చిరంజీవి "భోళా శంకర్ ", నాని "దసరా " మూవీస్ కు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి
నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

పూజాహెగ్డే మనసులో మాట
తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

"#RAPO19 " సెకండ్ షెడ్యూల్ పూర్తి
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ థ్యాంక్యూ మీట్ లో అఖిల్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు.

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్
కరోనా సెకండ్ వేవ్ తరువాత పెండింగ్ లో ఉన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా రిలీజ్ మోక్షం కలగలేదు. అందులో పూరీ తనయుడు ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిఉంది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇటీవలే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

'గామి' గా వస్తున్న విశ్వక్ సేన్
ఈ ఏడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా తగ్గట్లేదు. అంతేకాదు డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ఎంట్రీ పై 'అఖిల్' రియాక్షన్..!
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అటు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే అక్కడ ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక ఇక్కడ మరో యంగ్ హీరో కూడా బాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని వారసుడు అఖిల్.

"F 3" మూవీ దసరా స్పెషల్ వీడియో రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ "F 3 " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

'అన్నాత్తే' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అన్ని అడ్డంకులను దాటుకొని ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్
సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో ఆర్చిడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కర్రి బాలాజీ దర్శకత్వం లో పూర్ణ ప్రధాన పాత్రలో , తేజ త్రిపురాన హీరోగా రూపొందిన "బ్యాక్ డోర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రణవ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవిశంకర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "బ్యాక్ డోర్ "మూవీ దీపావళి కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం.

పాయల్ రాజ్ పుత్ క్రియేటివిటీ షో
సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. యంగ్ హీరోల పక్కన నటిస్తూనే మరోపక్క సీనియర్ హీరోల పక్కన జోడీ కట్టి “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.

హిందీ భాషలో భారీగా "ఆచార్య "రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4, 2022న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం
ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. అయితే ఆ మధ్య చాలా రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న అవికా మళ్లీ ఇప్పుడు సినిమాలపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలను చేసేస్తుంది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

దసరాకు "#NANI 29 " మూవీ అనౌన్స్ మెంట్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యం లో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అంటే .. సుందరానికీ! మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నజ్రియా నజీమ్ కథానాయిక.

దసరాకు 'నాని 29' అనౌన్స్ మెంట్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి. అందులోశ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంటే సుందరానికి సినిమా మాత్రం షూటింగ్ దశలోనే ఉంది.

'మంచి రోజులు వచ్చాయి' ట్రైలర్ రిలీజ్
ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్ శోభన్ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అనే మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చూశాం. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మై డియర్ వాట్సాప్ అంకుల్స్.. యూట్యూబ్ ఆంటీస్ అంటూ మొదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. ఇక మారుతి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఈసినిమాలో కూడా తన కామెడీ మార్క్ ను చూపించాడు…