ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 3తో మరోసారి నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈసారి సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు చాలా వరకూ పూర్తయింది.. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలిఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. హైద్రాబాద్‌లో జరిగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో దాదాపు ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఎఫ్ 3 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: