తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలాంటి నటులు… నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. వీరిద్దరి కలయికలో 14 చిత్రాలు రాగా… వాటిలో సింహభాగం విజయం సాధించాయి. అలాంటి ఈ ఇద్దరి మహానటుల వారసులైన… నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `సీతారామరాజు`. అన్నదమ్ములు సీతయ్య, రామరాజు పాత్రల్లో హరికృష్ణ, నాగార్జున ఒదిగిపోయి నటించిన వైనం… ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలచింది. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్, కామాక్షి మూవీస్ పతాకంపై నాగార్జున, డి.శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. స్వరవాణి కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రంలో… నాగ్‌కి జోడీగా సాక్షి శివానంద్, సంఘవి నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో రవితేజ, బ్రహ్మాజీ, శివాజీ, మాన్య, కల్పన, చంద్ర మోహన్, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, సత్య ప్రకాశ్, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఫిబ్రవరి 5, 1999న విడుదలైన `సీతారామరాజు`… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`సీతారామరాజు`… కొన్ని విశేషాలు
* మ్యూజికల్ హిట్‌గా నిలచిన ఈ సినిమాలో నాగార్జున మొట్టమొదటిసారిగా ఓ గీతాన్ని ఆలపించారు. `వినుడు వినుడు` అంటూ సాగే ఈ పాట అప్పట్లో అక్కినేని అభిమానులను ఎంతగానో అలరించింది.
* ఈ సినిమాలోని పాటలన్నింటిని `పద్మశ్రీ` సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.
* నాగార్జున నిర్మించిన `శ్రీ సీతారామ కళ్యాణం చూతము రారండి`తో దర్శకుడిగా పరిచయమైన వైవీఎస్ చౌదరి… మొదటి సినిమాని అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో రూపొందించగా… రెండో చిత్రాన్ని ఆయన వారసుడు నాగార్జునతో తెరకెక్కించడం విశేషం. అలాగే… రెండో సినిమాని అరుదైన కాంబినేషన్(నాగార్జున, హరికృష్ణ)లో రూపొందించి… ఇరు కుటుంబాల అభిమానులను అలరించారు.
* ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ `తమ్ముడు`. అయితే… కొన్ని కారణాల వల్ల `సీతారామరాజు` టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అదే… సినిమాకి కూడా యాఫ్ట్‌గా నిలచింది. ఇక ఇదే ఏడాదిలో `తమ్ముడు` టైటిల్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా కూడా విడుదలై ఘనవిజయం సాధించడం విశేషం.
* వైజాగ్, విజయవాడ, కాకినాడ, గుంటూరు, తెనాలి కేంద్రాలలో ఈ సినిమా నేరుగా శతదినోత్సవం జరుపుకుంది.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: