సంక్రాంతికి విడుదలైన మల్టీస్టారర్ మూవీ `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ గ్రాసర్‌ని సొంతం చేసుకున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఇదే ఊపులో… మరో మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆ చిత్రమే…`వెంకీ మామ`. తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి వెంకీ నటించనున్న ఈ సినిమా… ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా… రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభం కానుందని తెలిసింది. కథ రీత్యా… గ్రామీణ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తాయని… వాటికి సంబంధించిన చిత్రీకరణను రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం. అంతేకాదు… శరవేగంగా చిత్రీకరణ జరిపి… విజయ దశమి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకటేష్‌కి జోడీగా శ్రియ, నాగచైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న ఈ సినిమాకి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
[youtube_video videoid=YGvYS-pTa3Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: