ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత విపరీతంగా ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పటికే హీరోయిన్ల స్కెర్శిటీ ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేస్తుంది. మంచి స్టార్, మంచి డైరెక్టర్, మంచి కథ, మంచి టెక్నీషియన్స్- ఇలా అన్నీ మంచిగా సెట్ అయినప్పటికీ ఒక మంచి హీరోయిన్ దొరక్క భారీ సినిమాల షెడ్యూల్స్ సైతం వాయిదా పడటం తరచుగా జరుగుతుంది. మరి కొత్త కొత్త హీరోయిన్లు కోకొల్లలుగా వస్తున్నప్పటికీ ఫిలిమ్ ఇండస్ట్రీ హీరోయిన్ల విషయంలో ఎందుకు ఇంత డెఫ్షీట్ ఎదుర్కొంటోంది అని ఆలోచించాల్సిన తరుణమిది. అయితే వాస్తవంగా చూసుకుంటే హీరోయిన్ల కొరత అన్నది ఈనాటిది కాదు. దేశ జనాభాలో ఆడవాళ్ళ శాతం ఎంత వేగంగా తగ్గిపోతుందో ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ల శాతం కూడా అంతే తగ్గిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకప్పుడు సావిత్రి అనే ఒకే ఒక్క హీరోయిన్ డేట్స్ కోసం తెలుగు, తమిళ రంగాలకు చెందిన అగ్ర హీరోలు ఎన్టీఆర్,ఏఎన్నార్, ఎమ్ జీ ఆర్, శివాజీ గణేషన్ వంటి టాప్ స్టార్స్ వెయిట్ చేశారు అంటే అందులో అవాస్తవం ఏమాత్రం లేదు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే గతంలో లాగా హీరోయిన్స్ కు దశాబ్దాల లైఫ్ స్పాన్ ఉండటం లేదు . ఎంత పాపులర్ అయినప్పటికీ రెండు మూడేళ్లకే హీరోయిన్స్ కెరీర్ ముగిసిపోతుంది.
అందుకే సంవత్సరాల తరబడిగా పాతుకు పోయిన హీరోలకు ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ల కాంబినేషన్ అవసర పడుతుంది. ఈ నేపథ్యంలో మన సీనియర్ అండ్ జూనియర్ స్టార్స్ అందరూ కొత్త కాంబినేషన్ మీద కన్నేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ స్టార్స్ అందరూ వారి వారి సినిమాలలో కొత్త కాంబినేషన్స్ ట్రై చేస్తున్నారు.
ప్రస్తుతం “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో నయనతార, తమన్నా తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రంలో బాలకృష్ణ – విద్యాబాలన్, ఎఫ్-2 చిత్రంలో వెంకటేష్- తమన్నా, వరుణ్ తేజ్- మెహరీన్ , “వినయ విధేయ రామ” లో రామ్ చరణ్ – కియార అద్వానీ లది ఫ్రెష్ కాంబినేషనే.
ఇంకా నిర్మాణం ప్రారంభం కావలసిన అక్కినేని నాగార్జున మన్మధుడు 2 లో కూడా ఇంతవరకు నాగార్జునతో నటించని ఇద్దరు కొత్త హీరోయిన్స్ కోసం ప్రయత్నిస్తున్నారట.వీరిలో ఒక హీరోయిన్ గా RX 100 ఫేమ్ ‘పాయల్ రాజపుత్’ పేరు వినిపిస్తుంది.
ఇక ‘మహేష్ 25’ ” మహర్షి” లో పూజా హెగ్డే తొలిసారిగా మహేష్ బాబు సరసన నటిస్తుంది. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని వారు నిర్మించే చిత్రంలో బన్నీ సరసన కియారా అద్వానీ తొలిసారి నటించనున్నట్లుగా తెలుస్తోంది.
ఇక బహుబలి సిరీస్ తో నేషనల్ లెవెల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో శ్రద్ధా కపూర్, జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ వి.ఏ. ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న డిస్కోరాజా చిత్రంలో అతని సరసన ‘ఆర్ x100’ ఫేమ్” ‘పాయల్ రాజ్ పుత్’ ఫస్ట్ టైం జోడీ కడుతుంది.
ఇక most prestigious మల్టీ స్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR చిత్రంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ ల సరసన ఫ్రెష్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తె అయిన అలియా భట్ , రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా కజిన్ అయిన పరిణితి చోప్రా ల పేర్లు వినిపిస్తున్నాయి.
సో.. ఈ విధంగా టాప్ స్టార్స్ అందరూ కొత్త కాంబినేషన్ లతో వర్క్ చేయటం బాగానే ఉంది . అయితే అందువల్ల హీరోయిన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మామూలు పరిస్థితుల్లోనే హీరోయిన్లను, వాళ్ల భారీ పారితోషికాలను , వాళ్ల మమ్మీ ల డిమాండ్లను భరించటం కష్టం. మరి ఇలాంటి ఫ్రెష్ కాంబినేషన్ల నేపథ్యంలో మన పరభాషా కథానాయికల ”కథలు” ఏ రేంజిలో ఉంటాయో ఊహించలేము.మొత్తనికి ఈ
“ఫ్రెష్ క్రేజ్” వల్ల సినిమాలకు ఎంత మేలు జరుగుతుందో చెప్పలేము కానీ నిర్మాతలకు నిర్మాణ భారం శిరోభారంగా మారే అవకాశం ఎక్కువగానే ఉంది.
[youtube_video videoid=nEXYouKzJ0k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: