ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమా గత నెల జనవరి 25వ తేదీన రిలీజై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగన ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడివరకూ బాగానే ఉన్నా..గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై జరుగుతున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిష్.. మణికర్ణిక సినిమాకు 70 శాతం షూటింగ్ నేనే చేశానని.. తన డైరెక్షన్ క్రెడిట్‌ను కంగన తీసుకుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిష్ తో పాటు ఈ సినిమాలో నటించిన కొంత మంది నటీనటులు కూడా కంగనపై ఆరోపణలు గుప్పించారు. సినిమాలో తమ పాత్రను కంగన కత్తిరించిందని… సరిగా చూపించలేదని అన్నారు.
కాగా ఈ వివాదంపై కంగన తొలిసారి స్పందించారు. ఓ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కంగన మణికర్ణిక వివాదంపై స్పందిస్తూ… క్రిష్ కు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది ప్రొడ్యూసర్ తో మాట్లాడుకోవాలి.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం ఈ సినిమా క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం క్రిష్ నా చేతుల్లో పెట్టాడు.. నాకు కరెక్ట్ అనిపించింది చేశా.. దీనిపై ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వాల్సిన పాయింట్ లేదు… క్రిష్ ఇలా నన్ను ఎటాక్ చేయడం సరికాదు… ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండి… మీడియాతో మాట్లాడితే ఆయనకు ఎటువంటి లాభం లేదని చెప్పుకొచ్చింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో.. ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి..!
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: