యాక్షన్ చిత్రాల కథానాయకుడు గోపీచంద్… ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్… యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోందని సమాచారం. అంతేకాదు… ఈ సినిమా ఓ హిందీ బ్లాక్‌బస్టర్‌కి రీమేక్ వెర్షన్‌గా తెరకెక్కుతోందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం `ఏక్ థా టైగర్`. 2012 ఆగస్టు 15న విడుదలైన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్… సల్మాన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలచింది. ఇప్పుడీ సినిమానే గోపీచంద్ రీమేక్ చేస్తున్నాడని టాక్. అయితే… ఈ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా… ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా తమన్నా కథానాయికగా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: