4 లెటర్స్ మూవీ గురించి చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్ మాటల్లో..

Director R Raghuraj About 4 Letters Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,R Raghuraj About 4 Letters Movie,4 Letters Movie Latest News,4 Letters Telugu Movie Updates,Director R Raghuraj Few Words About 4 Letters Movie,4 Letters Movie New Updates
Director R Raghuraj About 4 Letters Movie

వెండితెరపై సరికొత్త ప్రేమ కథాచిత్రం ‘4 లెటర్స్’ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ సంయుక్తంగా ఈ రోజు ఉదయం పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్ మాట్లాడుతూ.. 4 లెటర్స్ మూవీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా.. ఈ సినిమా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి అంకితం ఇస్తున్నాము, అసలు ఈ స్టొరీ ఎలా పుట్టిందో చెపుతాను.. నేనొక రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ లో వస్తుంటే కార్లో “SCIENCE IS ABOUT KNOWING, ENGINEERING IS ABOUT DOING..BUT ALL ENGINEERS ARE DYEING” అన్న కొటేషన్ ఒకటి కనిపించి డ్రైవర్ ని అడిగా ఏంటిదని.? సార్ నేనొక B.tech స్టూడెంట్ ని మా అందరికి జాబ్స్ దొరక్క పదివేల రూపాయలకు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నాము..ఇంజినీరింగ్ అంటే వాల్యూ లేదని చెప్పగానే నేను ఆశ్చర్యపోయి కొన్నిరోజులు అతనితో ట్రావెల్ చేసి ఇంజినీరింగ్ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను, అలా ఈ స్టొరీ పుట్టింది..ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి మా సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుందని చెప్పారు.
“LOVE AT FIRST SIGHT” అని చెపుతూ ఉంటారు, కానీ అవన్నీ బ్రేకప్ అవుతున్నాయి.. “LOVE AT SECOND LOOK” అనే కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాము..మీ అందరికి నచ్చుతుంది..మా 4 లెటర్స్ ఒక్క యూత్ కే కాదు పెద్దవాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుందన్నారు.

వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరూ చేయని సాహసం మేము మా సినిమాలో చేశాం, అది మీరు థియేటర్ లో చూసినప్పుడు మీకు అర్ధమవుతుంది..ఈ సినిమాలో హీరో ఫాదర్ కి POOR అనే ఫోర్ లెటర్స్ నచ్చవు.. మరోవైపు హీరోయిన్ మదర్ కి RICH అనే ఫోర్ లెటర్స్ నచ్చవు.. హీరోయిన్ LOVE అనే ఫోర్ లెటర్స్ తో సతమతమవుతుంది.. హీరోయిన్ ఫాదర్ జీవితంలో FAIL అనే ఫోర్ లెటర్స్ తప్ప ఏం అనుభవించడు.. హీరో ఫ్రెండ్స్ PASS అనే ఫోర్ లెటర్స్ గురించి ఆలోచించరు.. యూత్ కి నచ్చే ఫోర్ లెటర్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు.

మేము ఈ చిత్రాన్ని రిచ్ లోకేషన్స్ లో చిత్రికరించాం..థాయిలాండ్ లోని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్ చేశాం..ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ తో కలిపి మొత్తం 75 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం..మేము చేసుకున్న ప్లానింగ్ షెడ్యుల్ కి సహకరించిన దొమ్మరాజు భాస్కర్ రాజు గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను..మా సినిమాలో హీరో ఈశ్వర్, హీరోయిన్స్ తువా చక్రబోర్తి మరియు అంకిత మహారాణలకు మొదటి సినిమా అయిన చాలా చక్కగా నటించారు. షూటింగ్ కి ముందు రెండు నెలలు వర్క్ షాప్ పెట్టడం వలన, ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేయగలిగినాము..మార్కెట్ లోకి వచ్చిన మా పాటలు మారుమ్రోగుతున్నాయి దీనికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, అతనిచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అవుతుంది.. మా DOP చిట్టిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే, చిత్రంలోని పాటలను షూట్ చేసిన విధానం మరియు సన్నివేశానికి తగ్గట్టు లైటింగ్ చేసి మా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో అతని తోడ్పాటు మరవలేనిది..

డే వన్ నుండి ఇప్పటి వరకు నేను ఏదడిగినా కాదనకుండా అన్ని సమకూర్చుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మమ్మల్ని ముందుకు నడిపించిన మా నిర్మాతలు దొమ్మరాజు ఉదయ కుమార్ & దొమ్మరాజు హేమలత గార్లకు ప్రత్వేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు.

[subscribe]

[youtube_video videoid=EGWZJk7v_c0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + five =