మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘటమైన పాదయాత్ర నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఈ సినిమాల వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలంటే ఇప్పుడు చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘యాత్ర’లో మీకు బాగా నచ్చిన అంశం ఏది?
కథ. దర్శక నిర్మాతలు నా దగ్గరికి ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చారు. నేను రాజశేఖర్రెడ్డి పాత్ర చేయగలనని వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పైగా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆలస్యం కాకుండా సినిమాలు పూర్తి చేయగల నిర్మాత. లెజెండరీ నాయకుడి పాత్ర. కాదనడానికి పెద్ద కారణాలు ఏవీ కనిపించలేదు. ‘యాత్ర’లో మహిళలు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు… ఇలా ఆయన ఎవరెవరిని కలిశారు? వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి ఏమేం చేశారు? అనేది కథ.
వైయస్సార్ పాత్రలో నటించడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు?
లేదు.. నిజానికి నేను ఆయనలా చేయడానికి ట్రై చేయలేదు.. వైయస్సార్ లా నడవడం మాట్లాడడం చూడటం కష్టమే.. తనది డిఫరెంట్ పర్సనాలిటీ.. అందుకే ఆ పాత్రలో ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించా.. అందుకని నా శైలిలోనే నటించాను.
‘యాత్ర’లో ప్రజల సమస్యలు ప్రధాన అంశం. ఏపీలో ప్రజలతో మీరు మాట్లాడుతున్నప్పుడు..వారి సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు.. మీ రాష్ట్రంలో సమస్యలు గుర్తొచ్చాయా?
ఎక్కడైనా ప్రజలు ఒక్కటే. భాషలు వేరు వేరు కావచ్చు.. కానీ పేదరికం ఒక్కటే. సమస్యలు వింటున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు చాలా ఎమోషనల్ అయ్యాను. నన్ను నేను కంట్రోల్ చేసుకుని నటించా.
మహి వి రాఘవ్ కొత్త దర్శకుడే కదా..? ‘యాత్ర’ చిత్రానికి ఆయన న్యాయం చేయగలరనుకున్నరా?
నా కెరీర్లో సుమారు 70 మంది దర్శకులను పరిచయం చేశా. మహి వి రాఘవ్ రెండు చిత్రాలు చేశారు కదా! ఆ 70 మంది లో 90 శాతం మంది దర్శకులు మలయాళంలో చిత్రాలు చేస్తున్నారు. ఇద్దరు తమిళ పరిశ్రమలో ఉన్నారు. కొత్త దర్శకులతో పని చేయడం నాకు అలవాటే.
మీకు రాజకీయాలంటే ఇంట్రెస్టేనా? రాజకీయాల్లో వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా?
మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం..తప్పకుండా రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. సినిమానే నాకు రాజకీయం. నా దృష్టిలో నేను రాజకీయాల్లో ఉన్నట్లే.
ఈ సినిమాలో మీరే డబ్బింగ్ చెప్పుకున్నారంట కదా నిజమేనా?
అవును నిజమే. ఈ విషయం బయటకు ఎలా వచ్చిందో తెలీదు. 100% ఎఫర్ట్స్ పెట్టి డబ్బింగ్ చెప్పాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. తెలుగులో మలయాళంలో చాలా సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి. కాకపోతే పలికే విధానంలోనే కాస్త తేడా ఉంది.
మీరు కోడి రామకృష్ణ లాంటి డైరెక్టర్స్ తో పని చేశారు కదా. ఇన్నేళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో చాలానే మార్పులు వచ్చాయి. మీరేమనుకుంటున్నారు?
తెలుగు పరిశ్రమ ఒక్కటే కాదు… ప్రతి సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
యాత్ర కాకుండా ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా మీరు కొత్తగా నటించినవి?
ఉంది.. నేను తమిళ్ లో నటించిన పెరంబు మూవీ ఈ రోజు హైదరబాద్ లో రిలీజైంది.
మీరు ఒక సినిమాను 50-60 రోజుల్లో పూర్తి చేస్తారు.. ఆతరువాత వెంటనే మరో కొత్త సినిమాకు మూవ్ అయిపోతారు… అలా ఏడాదికి 5 సినిమాలైనా వస్తుంటాయి మీవి.. ఈ వయసులో కూడా మీరు ఇంత ఎనర్జీగా ఉండటానికి సీక్రెట్ ఏంటంటారు?
సీక్రెట్ ఏం లేదండీ.. ఇది నా ప్రొఫెషన్…నేను ఇలానే పని చేయడానికి ఇష్టపడతా.. ఇది నా ప్యాషన్… ఎన్ని సినిమాలు చేయగలిగితే అన్ని చేస్తా..నంబర్ అంటూ ఏం లేదు.
తెలుగు సినిమాలు చూస్తుంటారా?
చూస్తుంటాను… రీసెంట్ గా ‘భరత్ అనే నేను’, ‘రంగస్థలం’ సినిమాలను చూశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో రకరకాల సినిమాలు తెరకెక్కుతుంటాయి. వాటిని ప్రేక్షకులు ఆదరించే విధానం కూడా బాగుంటుంది. ప్రయోగాలు చేస్తున్నారు. అదే సమయంలో కమర్షియల్ చిత్రాలు కూడా తీస్తున్నారు.
[youtube_video videoid=MkaDt7KB5eQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: