
ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 2


"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్

సత్యరాజ్ కు కరోనా పాజిటివ్

స్టార్ హీరోయిన్ త్రిష కు కరోనా పాజిటివ్

'కాతు వాకుల రెండు కాదల్'.. నెగిటివ్ రోల్ లో సామ్

జిమ్ లో నాని సెల్ఫీ

చిరంజీవి కి జోడీగా శృతి హాసన్ ?

ప్రేమకు అడ్డంకులు ఉండవు -నితిన్

'థమన్' కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ లో "పుష్ప :ది రైజ్" హవా

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్

త్వరగా కోలుకో అన్నా - ఎన్టీఆర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్

మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న 'సామాన్యుడు'

సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సమంత 'యశోద'

ప్రభాస్ పై 'ఆది పురుష్' డైరెక్టర్ ప్రశంసలు

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ

సుకుమార్ మనసులో మాట
బ్లాక్ బస్టర్ "ఆర్య "(2004 ) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ "ఆర్య 2", 100%లవ్ ", "నాన్నకు ప్రేమతో "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి 200కోట్ల క్లబ్ లో చేరింది. సుకుమార్ , అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన "పుష్ప :ది రైజ్"మూవీ ప్రపంచవ్యాప్తం గా 300కోట్లు కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి సుకుమార్ తన అసిస్టెంట్స్ ను దర్శకులు గా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై పి ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ "తమ్ముడు " మూవీ 1999 జూలై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ప్రీతీ జింగానియా కథానాయిక. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు అరుణ్ ప్రసాద్ "తమ్ముడు" మూవీని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమణ గోగుల సంగీతం ప్రేక్షకులను అలరించింది.

సత్యరాజ్ కు కరోనా పాజిటివ్
గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత దెబ్బతిందో చూస్తూనే ఉన్నాం. ఇక మళ్లీ థర్డ్ వేవ్ అలా మొదలైందో లేదో అప్పుడు దాని ప్రభావం సినీ పరిశ్రమపై చూపిస్తూనే ఉంది. ఇప్పటికే దీనివల్ల థియేటర్లు మూతపడుతున్నాయి. దాంతో సినిమాల రిలీజ్ లు కూడా ఆగిపోతున్నాయి. దీనికితోడు వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ప్రతి రోజు తాము కరోనా బారిన పడ్డామని ఎవరో ఒక సెలబ్రిటీ తమ సోషల్ మీడియా ద్వారా చెబుతూనే ఉన్నారు. గత కొద్దిరోజులు కిందటే మంచు మనోజ్, విశ్వక్‌సేన్, మంచు లక్ష్మీ కరోనా గురించి చెప్పగా.. రెండు రోజుల కిందటే ప్రిన్స్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కరోనా వచ్చింది. తాజాగా స్టార్…

స్టార్ హీరోయిన్ త్రిష కు కరోనా పాజిటివ్
తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బ్రింద” షూటింగ్ ప్రారంభం అయ్యింది.

'కాతు వాకుల రెండు కాదల్'.. నెగిటివ్ రోల్ లో సామ్
టాలీవుడ్ లో తన పాత్రల ద్వారా... తన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత. ఇప్పుడు సమంత తన పంథాను పూర్తిగా మార్చేసింది. కేవలం సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ గా మాత్రమే చేయకుండా సినిమా మొత్తం తన మీదే నడిచే సినిమాలను సైతం చేస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అయితే తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. యశోద సినిమా షూటింగ్ దశలో ఉంది.

మెగా స్టార్ కోసమే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ - రెజీనా
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

జిమ్ లో నాని సెల్ఫీ
హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. రెండు విభిన్న పాత్రలలో నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

చిరంజీవి కి జోడీగా శృతి హాసన్ ?
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ప్రేమకు అడ్డంకులు ఉండవు -నితిన్
కరోనా మహమ్మారి విజృంభించి సాధారణ ప్రజలతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులపై ప్రతాపం చూపుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ వార్త షాక్ ఇవ్వగా తరువాత యంగ్ హీరో నితిన్ తన భార్య కూడా కోవిడ్-19 తో ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలిపారు. ఆమెకి కరోనా సోకి హోమ్ క్వారంటైన్ లో ఉండగా పుట్టిన రోజు కావడంతో హీరో నితిన్ కేక్ కట్ చేసి తన భార్యకు శుభాకాంక్షలు తెలిపారు.

'థమన్' కు కరోనా పాజిటివ్
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మళ్లీ సెలబ్రిటీల పై బాాాగానే పడుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పి షాకిచ్చారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయ్. దీనితో నేను నా ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటున్నా. వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాతో కొన్నిరోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ తెలిపారు. అలా చెప్పారో లేదో ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డారు.

బాలీవుడ్ లో "పుష్ప :ది రైజ్" హవా
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు…

త్వరగా కోలుకో అన్నా - ఎన్టీఆర్
కరోనా మహమ్మారి ఫస్ట్ , సెకండ్ వేవ్ లతో ప్రపంచవ్యాప్తం గా ప్రజలను పలు విధాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ తో విజృంభించి ప్రజలపై తన ప్రతాపం చూపుతుంది. రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత అధికమవుతుంది. రోజుల వ్యవధిలో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు కరోనా పాజిటివ్ అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తన విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసే మహేష్ బాబు ఫిట్ నెస్ ,ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న "సర్కారు వారి పాట " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న 'సామాన్యుడు'
ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఈనేపథ్యంలోనే విశాల్ సామాన్యుడు కూడా సంక్రాంతి బరిలో దిగనున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. నిజానికి ఈసినిమాను ముందు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సామాన్యుడు ని కూడా సంక్రాంతి రేసులో దించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడం.. దానికితోడు తమిళనాడు…

సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సమంత 'యశోద'
సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. దీనిలో భాగంగానే సమంతతో కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు మేకర్స్. ప్రస్తుతానికి అయితే సమంత పలు సినిమాలతో బిజీగా ఉంది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ప్రభాస్ పై 'ఆది పురుష్' డైరెక్టర్ ప్రశంసలు
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి బాహుబలి, సాహో సినిమాల తరువాత ప్రభాస్ మార్కెటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు ప్రభాస్ సినిమాలు చేయడానికి కేవలం తెలుగు నుండే కాదు నార్త్ లో కూడా పోటీ పెరిగింది. ఇక నార్త్ లో కూడా ఎంతోమంది ప్రభాస్ తో సినిమా చేయడానికి పోటీ పడగా ఆ అవకాశం మాత్రం ఓం రౌత్ కు మాత్రమే దక్కింది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆది పురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'
టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అన్నీ అనుకున్నట్టు ఉండి ఉంటే రేపు రిలీజ్ అయి ఉండేది. కానీ అందరినీ నిరాశ పరస్తూ మళ్లీ వాయిదా పడింది. ఒమిక్రాన్ ప్రభావం రోజు రోజుకి పెరగడంతో.. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూసేయడంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ గురించి అనుపమ పరమేశ్వరన్
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన “రౌడీ బాయ్స్ ‘మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.