‘కాతు వాకుల రెండు కాదల్’.. నెగిటివ్ రోల్ లో సామ్

Samantha to Play Negative role in Vijay Sethupathi Movie,Latest Telugu Movie 2022,Telugu Filmnagar 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Samantha,Samantha to Play Negative Role,Samantha Latest Movies,Samantha Upcoming Movies,Samantha in Vijay Sethupathi Movie,Samantha to Play Negative role in Vijay Sethupathi Upcoming Movie,Vijay Sethupathi,Vijay Sethupathi Latest Movie,Vijay Sethupathi Upcoming Movie,Vijay Sethupathi Latest Movies,Vijay Sethupathi Movie Updates,Vijay Sethupathi Latest Movie 2022

టాలీవుడ్ లో తన పాత్రల ద్వారా… తన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత. ఇప్పుడు సమంత తన పంథాను పూర్తిగా మార్చేసింది. కేవలం సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ గా మాత్రమే చేయకుండా సినిమా మొత్తం తన మీదే నడిచే సినిమాలను సైతం చేస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అయితే తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. యశోద సినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సామ్ తమిళ్ లో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.  విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా.. నయనతార కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో సమంత కతిజ అనే పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో నటిస్తున్న సామ్ గురించి ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో సమంత నెగిటివ్ రోల్ లో కనిపించబోతోందట. ఈసినిమాకు సమంత పాత్ర చాలా కీలకం అంటున్నారు. మరి ఏ పాత్ర అయినా సమంత ఒదిగిపోతుంది. మరి ఈ పాత్రను కూడా సమంత చాలా ఈజీగా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈ సినిమాను వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.