తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్ టైనర్ చిరంజీవి 154 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జాలరి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయికగా నటించనున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: