కరోనా మహమ్మారి విజృంభించి సాధారణ ప్రజలతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులపై ప్రతాపం చూపుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ వార్త షాక్ ఇవ్వగా తరువాత యంగ్ హీరో నితిన్ తన భార్య కూడా కోవిడ్-19 తో ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలిపారు. ఆమెకి కరోనా సోకి హోమ్ క్వారంటైన్ లో ఉండగా పుట్టిన రోజు కావడంతో హీరో నితిన్ కేక్ కట్ చేసి తన భార్యకు శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
COVID has barriers…
But LOVE has no BARRIERS..
HAPPY BIRTHDAY MY LOVE❤️
LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu 😘😘 pic.twitter.com/5zFuOOIaqe— nithiin (@actor_nithiin) January 6, 2022
తన భార్య ఐసోలేషన్ రూమ్ లో ఉంటే నితిన్ తాను కింద నుంచి కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ బర్త్ డే జరిపారు. కరోనా కి హద్దులు ఉండొచ్చేమో కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవనీ , లైఫ్ లో ఫస్ట్ టైమ్ నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నాననీ ట్వీట్ చేస్తూ ఆ వీడియో ను నితిన్ షేర్ చేశారు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న “మాచర్ల నియోజకవర్గం “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: