శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై పి ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ “తమ్ముడు ” మూవీ 1999 జూలై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ప్రీతీ జింగానియా కథానాయిక. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు అరుణ్ ప్రసాద్ “తమ్ముడు” మూవీని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమణ గోగుల సంగీతం ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“తమ్ముడు” మూవీ తో అరుణ్ ప్రసాద్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో అరుణ్ ప్రసాద్ “తమ్ముడు ” మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిపారు. అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ .. “తమ్ముడు” మూవీ కథను ముందుగా తమిళ హీరో అజిత్ కి వినిపించాననీ , కథ విన్న తరువాత అజిత్ ఈ కథను తాను చేయడం కంటే పవన్ కల్యాణ్ చేస్తే బాగుంటుందని అన్నారనీ , ఆ కథకి , ఆ పాత్రకి పవన్ బాడీ లాంగ్వేజ్ అయితే కరెక్టుగా సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనీ , కథ వినగానే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ , తరువాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది మీ అందరికీ తెలిసిందేననీ ,”తమ్ముడు” తరువాత తాను కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాకి మాత్రమే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందనీ , ఆ సినిమాను .. అది ఇచ్చిన సక్సెస్ ను .. అప్పటి జ్ఞాపకాలను తాను ఎప్పటికీ మరిచిపోలేను అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: