కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి , రెజీనా స్పెషల్ సాంగ్ “శానా కష్టం”ను రిలీజ్ చేసింది. ఆ సాంగ్ లో చిరంజీవి , రెజీనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “శానా కష్టం” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇటీవల ఒక కార్యక్రమం లో రెజీనా మాట్లాడుతూ .. ఇటువంటి సాంగ్‌లో నటించడం ఇదే తొలిసారి అనీ , చిరంజీవి గారి కోసమే ఒప్పుకున్నాననీ , చిరంజీవి గారిని మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తారో సెట్‌లో చూస్తే అర్దమయిందనీ , ఆయన డ్యాన్స్ అంటే తనకెంతో ఇష్టమనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: