
ట్యాగ్ · 156 కథనాలు · పేజీ 6


"బంగార్రాజు"మూవీ ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ డేట్స్

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ

పాత్ర నచ్చితేనే ఏదైనా... రష్మిక

నయనతార బర్త్ డే కి సమంత స్పెషల్ విషెస్

సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'

బాలీవుడ్ మూవీస్ లో హైదరాబాదీ అమ్రిన్ ఖురేషి

'ఆర్ఆర్ఆర్' బీజానికి నాలుగేళ్లు

అందం అంటే .. - కృతిశెట్టి

'గని' మేకోవర్ పై చిరు ప్రశంసలు

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్

"బేబి"మూవీ కాస్టింగ్ కాల్

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ

ఏక కాలంలో రామ్ చరణ్ రెండు మూవీస్ షూటింగ్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. హీరో రామ్ చరణ్ కు స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అలాంటి సబ్జెక్ట్ తో సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సంప్రదించడం తో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖండ'.. బాలయ్య విశ్వరూపం..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ సినిమాల తరువాత వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

"బంగార్రాజు"మూవీ ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ డేట్స్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ
బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ జోరు పెంచారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో…

పాత్ర నచ్చితేనే ఏదైనా... రష్మిక
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక నటిస్తున్నారు.

నయనతార బర్త్ డే కి సమంత స్పెషల్ విషెస్
విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "కాతు వాకుల రెండు కాదల్ " తమిళ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయన తార బర్త్ డే (నవంబర్ 18) కి అభిమానులు ,సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. "కాతు వాకుల రెండు కాదల్ " మూవీ సెట్ లో నయనతార బర్త్ డే ఏర్పాట్లను దర్శకుడు విఘ్నేష్ శివన్ స్వయంగా చేశారు. నయనతార చేత భారీ కేక్‌ని కట్ చేయించి కాబోయే భార్యకి విషెస్ తెలిపారు.

సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. గత ఏడాది ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో అలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ఈఏడాది జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈరెండు సినిమాలు కూడా సూర్య ని మరో స్థాయికి తీసుకెళ్లాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఇక నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలానే రజినీకాంత్ సినిమా అన్నాత్తే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

బాలీవుడ్ మూవీస్ లో హైదరాబాదీ అమ్రిన్ ఖురేషి
హైదరాబాద్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళిన షబానా అజ్మీ, ఫరా, టబు, అదితి రావు హైదరీ సక్సెస్ ఫుల్ మూవీస్ తో సత్తాచాటుతున్నారు. ఇప్పుడు మరో హైదరాబాదీ అమ్రిన్ ఖురేషి రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. అమ్రిన్ ఖురేషి ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి తనయ, రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ.ఖురేషి మనవరాలు. గ్లామర్ రోల్స్‌తో పాటు ట్రెడిషనల్ పాత్రలకు తాను బెస్ట్ ఆప్షన్ అనేలా తనను తాను మౌల్డ్ చేసుకున్న అమ్రిన్ ఖురేషి తెలుగు సూపర్ హిట్స్ "జులాయి ", "సినిమా చూపిస్త మావ"హిందీ రీమేక్ మూవీస్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' బీజానికి నాలుగేళ్లు
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. అంతేకాదు ఎన్టీఆర్ ను రామ్ చరణ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి మూడేళ్లు అవ్వడంతో అటు ఎన్టీఆర్ అభిమానులు కానీ చరణ్ అభిమానులు కానీ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ఇటుగా ఈసినిమాకు కూడా బహుబలి సినిమాకు పట్టినంత టైమే పట్టింది. అయితే మధ్యలో కరోనా రావడంవల్ల మరింత ఆలస్యం అయిందనుకోండి. దాదాపు ఏడాదిన్నర పాటు కరోనా వల్లే షూటింగ్ లేట్ అయింది. ఫైనల్ గా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

అందం అంటే .. - కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కృతి శెట్టి కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో కృతి శెట్టి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ లో కృతిశెట్టి ముగ్గురు కథానాయికలలో ఒకరిగా నటించారు. ఆ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. .

'బంగార్రాజు'.. కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా బంగార్రాజు. ఈసినిమా సోగ్గాడో చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోపక్క ఈసినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లను అయితే చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా రీసెంట్ గానే లడ్డుందా అనే పాటను రిలీజ్ చేశారు. నాగ్ కూడా ఈపాటను పాడగా ప్రస్తుతం ఈపాట బాగానే అలరిస్తుంది.

'గని' మేకోవర్ పై చిరు ప్రశంసలు
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, లుక్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇలాంటి సినిమాలు తీయాలంటే ఫిజిక్ పరంగా కూడా ఎంత శ్రద్దపెట్టాలో చెప్పనక్కర్లేదు. గంటలకొద్దీ వర్కవుట్స్ చేస్తే కానీ అంత ఫిట్ నెస్, మంచి ఫిజిక్ అనేది రాదు. వరుణ్ కూడా ఈసినిమాలో మేకోవర్ కోసం చాలానే కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు వరుణ్ పడిన కష్టంపై మెగాస్టార్ చిరు కూడా స్పందించి ప్రశంసలు కరిపించారు. ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్ అంటూ ట్వీట్ చేశారు…

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్
పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ "బ్లఫ్ మాస్టర్"మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "రామ్ సేతు" హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'మరక్కార్'.. కీర్తి సురేష్ న్యూ పోస్టర్ రిలీజ్
ప్రియదర్శన్ దర్శకత్వంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ మరక్కార్. కేరళ నేవీ ఆఫీసర్‌గా చేసిన కుంజాలీ మరక్కార్ 4 జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 2న ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.

"బేబి"మూవీ కాస్టింగ్ కాల్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ వరస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి సినిమాల కోసం ఆనంద్ ఎంతో తపనగా హార్డ్ వర్క్ చేస్తూ తన సోదరుడి సలహాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా "పుష్పక విమానం" మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ మరో మూవీ తో అలరించనున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్ , వైష్ణవిచైతన్య ప్రధాన పాత్రలలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న "బేబి"మూవీ దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ"మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన "అఖండ " మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి. "అఖండ " మూవీ తరువాత హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారారు.

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "రౌద్రం రణం రుధిరం ", "ఆచార్య " మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "RC15 " మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "RC16" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ
తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నంత మంది కమెడియన్స్ మరే ఇండస్ట్రీలోనూ లేరన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఏ ఇద్దరు టాప్ కమెడియన్లు ఒకే సినిమాలో కనిపించరు. అంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అలా ఉండదు. ఒకే సినిమాలో.. 30 మంది కలిసి నటించమన్నా కూడా నటిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ కమెడియన్లంతా కలిసి ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. కలిసుంటే కలదు సుఖం అంటున్నారు.